‘జాంబి రెడ్డి’ మూవీ రివ్యూ.. | ‘Zombie Reddy’ Movie Review

39
zombie-reddy-movie-review

అ! సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించిన ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమా కల్కితో మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు. ఇక తన థర్డ్ ప్రాజెక్ట్ గా ‘జాంబి రెడ్డి’ సినిమా చేశాడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంది, దక్షలు హీరోయిన్స్ గా నటించారు. జబర్దస్త్ గెటప్ శ్రీను, ఆర్జే హేమంత్ లు స్పెషల్ రోల్స్ లో నటించారు. కరోనా లాక్ డౌన్ టైం లోనే కర్నూలులో పెళ్లి పెట్టుకుంటాడు హీరో ఫ్రెండ్. అక్కడ కరోనా వ్యాక్సిన్ తయారు చేసి వికటించడంతో అక్కడ వాళ్లంతా జాంబీలుగా మారుతారు. అక్కడకు వెళ్లిన హీరో అండ్ గ్యాంగ్ ఎలా ఈ సమస్య నుండి బయటపడ్డారు అన్నది సినిమా కథ. ‘అ!’ నుండి ‘జాంబి రెడ్డి’ వరకు ప్రశాంత్ వర్మ కథలు చాలా కొత్తగా ఉంటున్నాయి.

అయితే కరోనా టైం లో రాసుకుని చేసిన ఈ సినిమా కూడా ఇంప్రెస్ అయ్యేలానే ఉంది. తెలుగులో వస్తున్న మొదటి జామీ సినిమాగా జాంబి రెడ్డి క్రేజ్ తెచ్చుకోగా సినిమా అంతా కామెడీ ప్రధానంగా చేయడం కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ప్రశాంత్ వర్మ ఇదే సీరియస్ గా చేసి ఉంటే అవుట్ పుట్ వేరేలా ఉండేది. జాంబీలను తీసుకుని కామెడీగా సినిమా నడిపించాడు. తేజ తో పాటుగా మిగతా నటీనటులు కూడా బాగా నటించారు. సినిమా అంతా కామెడీగానే వెళ్తుంది. జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను తన పాత్రకు న్యాయం చేశాడు. ఈ సినిమాతో గెటప్ శ్రీనుకి మంచి గుర్తింపు వస్తుంది. ఆల్రెడీ బుల్లితెర మీద గెటప్ శ్రీను సత్తా అందరికి తెలిసిందే. జాంబి రెడ్డితో సిల్వర్ స్క్రీన్ పై కూడా అతను అదగొట్టాడని చెప్పొచ్చు. ఇక లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా అవుట్ పుట్ బాగానే వచ్చింది. జామీలకు మేకప్.. ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్ని బాగున్నాయి. కెమెరా మెన్ పనితనం మెప్పించింది. మ్యూజిక్ కూడా ఇంప్రెస్ చేసింది.. బిజిఎం కూడా ఆకట్టుకుంది.. ఓవరాల్ గా ఈ సినిమాకి క్రిటిక్స్ నుండి వస్తున్న రేటింగ్ 3/5.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here