పీక కోస్తానని బెదిరించడంతో ఆ విధ్వంసం జరిగింది..!

0
125
Yuvraj Singh Finally Reveals What Andrew Flintoff

2007 టీ20 ప్రపంచ కప్ లో ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆడిన ఆట ఏ క్రికెట్ అభిమానిని కూడా ఇంతవరకు యువరాజ్ ని మర్చిపోనివ్వదు. ముఖ్యంగా అతనుకొట్టిన 6 బంతుల్లో 6 సిక్సులు ప్రపంచ రికార్డు భారత క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టం అని చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ ఆటగాడు స్టువర్డ్ బ్రాడ్‌కు చుక్కలు చూపిస్తూ యూవీ బాదిన ఆ బాదుడు ఇప్పటికి కళ్ళముందు కదలాడుతుంది. అసలు ఆ మ్యాచ్ లో ఫ్లింటాఫ్ కు మరియు యూవీ కి మధ్య గొడవ జరగడం వలెనే యూవీ రెచ్చిపోయి ఆ బాదుడు బాదాడని అందరికి తెలుసు కానీ ఇంతవరకు ఫ్లింటాఫ్ యూవీ ని ఏమన్నాడో ఇద్దరు ఆటగాళ్లలో ఎవ్వరు బయట పెట్టలేదు. ఆ మ్యాచ్‌లో 17వ ఓవర్ వేసిన ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా రెండు ఫోర్ లు కొట్టడంతో ఫ్లింటాఫ్ ఏమిచేయాలో తెలియక నోరుపారేసుకున్నాడు. దీనితో యూవీ కూడా ఫ్లింటాఫ్ కు ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. దీనితో ఇద్దరిమధ్య మాట మాట పెరగడంతో ఈ గొడవలో అంపైర్ జోక్యం చేసుకుని వారిద్దరి గొడవను ఆపాల్సి వచ్చింది.

వీరిద్దరి ఘర్షణ తరువాత జరిగిన ఓవర్ కు స్టువర్ట్ బ్రాడ్ బంతులు వేయగా యువరాజ్ ఆ బంతులన్నిటిని ఇంగ్లాండ్ టీం కి చుక్కలు కనిపించేటట్లుగా బాదాడు. తాజాగా లాక్ డౌన్ నేపథ్యం లో ఇంటివద్దే ఉంటున్న యువరాజ్ ఆ రోజు తనకు, ఫ్లింటాఫ్ కు మధ్య ఏమి జరిగిందో చెప్పారు. నాటి మ్యాచ్ గురించి గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. నిజం చెప్పాలంటే నా మైండ్ లో ఆరు సిక్సర్లు కొట్టాలనే ఆలోచనే లేదు. తన బౌలింగ్ లో రెండు బాల్స్ కు రెండు ఫోర్ లు కొట్టాననే కోపంతో ఫ్లింటాఫ్‌ నన్ను’ పీక కోస్తా’ అని తిట్టడంతో నేనుకూడా నా చేతిలోని బ్యాట్ చూపించి చూస్తున్నావ్ కథా దీనితో నిన్ను ఎక్కడ కొడతానో నీకు బాగా తెలుసు అని సమాధానమిచ్చాను. ఆ తర్వాత ప్రతి బంతిని సిక్స్ కొట్టాలని నిర్ణయించుకున్నాను. ఫ్లింటాఫ్ కు నా హిట్టింగ్ తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాను. అదృష్టవ శాత్తు నాకు టైం కూడా కలిసొచ్చింది అని చెప్పాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ధోని, సురేష్ రైనా అంటే తనకి చాల ఇష్టమని యువరాజ్ తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here