వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటన ఆ రోజుల్లోనే..

37
ys-sharmilas-new-party-announcement-date-fixed

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల. ఇందుకు సంబంధించి ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఇప్పటికే కొందరు ముఖ్యనేతలతో మరియు పలు జిల్లాల నేతలతో సమావేశమైన షర్మిల. తెలంగాణలో పెట్టబోతున్న తన కొత్త పార్టీ విధివిధానాలు ఏ రకంగా ఉంటె బాగుంటుంది అనే విషయంపై కసరత్తులు చేస్తున్నట్టు లోటస్ పాండ్ వర్గాలనుండి అందుతున్న సమాచారం. ఇదిలా ఉంటే షర్మిల తన కొత్త పార్టీని ఏ తేదీన ప్రకటిస్తారనే దానిపై మాత్రం వివరణ ఇవ్వలేదు. అయితే షర్మిల కొత్త పార్టీకి సంబంధించిన ప్రకటన మే లేదా జూలై నెలలో ఉండొచ్చని తెలుస్తోంది. ఇందుకు ప్రత్యేకమైన కారణం కూడా లేకపోలేదు.

మే 14వ తేదీ 2004 వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక జూలై 8 న ఆయన పుట్టినరోజు. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీన కచ్చితంగా వైఎస్ షర్మిల తన పార్టీకి సంబందించిన ప్రకటన చేస్తారని సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితానికి సంబంధించిన ఈ రెండు ముఖ్యమైన తేదీల్లోనే ఆమె పార్టీకి సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలు చేయడానికి మొగ్గు చూపుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో తొందర పనికిరాదని నిర్ణయించుకున్న వైఎస్ షర్మిల పూర్తిస్థాయిలో సిద్ధం కావడానికి మరో రెండు మూడు నెలల సమయం పడుతుందనే ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here