దర్శక బాధ్యతలు చేపట్టనున్న ప్రముఖ హీరో ….???

0
50
Nikhil

దర్శకుడిగా యంగ్ హీరో నిఖిల్ . తాను చిన్నారులతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తానని వెల్లడించారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చూపించాడు. హ్యాపీడేస్ చిత్రంతో సినీ పరిశ్రమలోకి పరిచయం ఐన నిఖిల్ . కొత్త కొత్త అంశాల తో కూడిన సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు ఈ హీరో ఇపుడు డైరెక్టర్ గా మారేందుకు సిద్ధంగా ఉన్నాడు . ఓ టీవీ షోలో మాట్లాడుతూ, త్వరలోనే తాను చిన్నారులతో ఓ సినిమా చేస్తానని చెప్పాడు. లాక్ డౌన్ మార్గదర్శకాలు పాటిస్తూ ఈ సినిమా తీయనున్నాడట. అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా, నటుడిగా ప్రేక్షకులను అలరించిన నిఖిల్‌, డైరెక్టర్ గా బాధ్యతలు వహించనున్నారు .

చాలా ముందే తన ఫ్యామిలీ లైఫ్ గురించి పుట్టబోయే పిల్లల గురించి కూడా నిఖిల్ ముచ్చటించడం వైరల్ అయ్యింది. త్వరలో సెట్ లోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు. ఆన్ లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో షూటింగ్ చేయడానికి ఒక్కో హీరో ముందుకొస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here