xiaomi ధరల పెరుగుదల…

0
132
xiaomi

చైనా కి చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ xiaomi ఇక ఉంచి ఫోన్స్ ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. మొబైల్ ఫోన్స్ పై జి ఎస్ టి పెరగడం , రూపాయి విలువ పడిపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. గత నెల జిఎస్టి మండలి సమావేశం లో మొబైల్ ఫోన్స్ పై జిఎస్టి ని 12 నుంచి 18 శాతానికి పెంచింది.

ఈ నేపథ్యంలో xiaomi ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ ట్వీట్ చేసారు. ఇప్పటి వరకు 5 శాతం తక్కువ లాభంతో ఉత్పత్తులను విక్రయించామని, జిఎస్టి పెరగడం, రూపాయి విలువ తగ్గిపోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నామని ట్వీట్ చేసారు. అయితే పెరిగిన ధరలను ఇంకా వెబ్ సైట్స్ లో అప్ డేట్ చేయకపోవడం గమనార్హం.

దాదాపుగా 1000 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇతర మొబైల్ కంపెనీలు ఒప్పో, వివో వంటివి కూడా ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here