అందరి చూపులు ఆ బంగ్లా వైపే..

31
worlds-thinnest-bungalow-is-for-sale-in-london

ప్రపంచంలో చాల వింతలు ఉన్నాయి. అలాంటి వాటిల్లోకి లండన్ లో ఉన్న ఓ బంగ్లా కూడా చేరుతుంది. ప్రపంచంలోనే అతి పలుచని బంగ్లాగా పేరుపొందిన ఈ బిల్డింగ్ లండన్ నగరంలో ఉన్నది. రెండు పెద్ద బిల్డింగ్ ల మధ్య ఇరుక్కుపోయి బయటికి రాలేనట్టుగా కనిపించే ఈ బంగ్లాను 19వ శతాబ్దం చివరిలో కట్టారు. టోపీల వ్యాపారం చేసే ఓ ఫ్యామిలీ వారి వ్యాపార కార్యకలాపాల కోసం ఈ బిల్డింగ్ ను నిర్మించుకున్నారు.

మొత్తం నాలుగు అంతస్తులు కలిగిన ఈ బిల్డింగ్ పొడువు బాగానే ఉన్నప్పటికీ వెడల్పు మాత్రం ఆరు నుంచి ఏడు అడుగుల వరకు మాత్రమే ఉంటుంది. దీంతో ఈ బిల్డింగ్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ అమ్మకానికి వచ్చిందట. ఈ బిల్డింగ్ ధర రూ.11 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో వంటగది, ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్ రూమ్, స్టడీ రూమ్, సెకండ్ ఫ్లోర్ లో బాత్ రూమ్, షవర్ రూమ్, మూడో ఫ్లోర్ లో మాస్టర్ బెడ్ రూమ్ లను కలిగిఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here