

కొందరు పాలు పేరు విన్న చుసిన దూరంగా వెళ్లిపోతారు లేదా ముక్కు మూసుకుని గట తాగేస్తుంటారు.పాలు ఆరోగ్యానికి చాలా మంచిది, పాలు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని చెపుతుంటారు.పిల్లల దగ్గరనుంచి వృద్ధుల వరకూ అందరు పాలు తాగడం వల్ల పోషకాలు పొందొచ్చని నిపుణులు తెలిపారు.
శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ పాలలో సమృద్ధి గా ఉంటాయి.పాలలో ఉండే విటమిన్లు, మినరల్స్, ఇంకాకొన్నిపోషకాలు మన శరీర పోషణ కు ఎంతో అవసరం. పాలను కాఫీ ల్లో, టీ ల్లో షేక్స్‌లో, ఇలా ఏదో ఒకరకం గా తప్పక వాడమంటున్నారు ఆరోగ్యనిపుణులు.పాలలో హైక్వాలిటీ ప్రోటీన్స్ తో పాటుగా బీ గ్రూపు విటమిన్లు ఉంటాయి.
యాంటీఆక్సిడెంట్స్ శరీరం లో వ్యర్థాలనుబయటకి పంపి బలమైన ధృఢమైన దంతాలు, ఎముకల్ని నిర్మిస్తాయి. బరువు తగ్గుతారు.అస్థియోపోరోసిస్ వ్యాధి రాకుండా రక్షణ కల్పిస్తాయి. పాలలో ఉండే పొటాషియం,రక్త నాణాల్లో రక్త ప్రసరణను క్రమబద్ధీకరించడం వలన గుండె జబ్బులు, లాంటివి రాకుండా ఉంటాయి. పాలను డైట్లో ఉండేలా చేసుకుంటే బరువు తగ్గుతారు.
చాలా మంది పిల్లల లో ఊబకాయాన్ని కి కారణం, వాళ్ళు పాలను సరిగా తీసుకోకపోవడమేనని కొన్ని అధ్యయనాల ద్వారా తేలింది. పాలుతాగిన తర్వాత కొద్దిసేపటికి పొట్ట నిండిననట్టు అనిపిస్తుంది .ఏ ఆహారమూ తినాలనిపించాదు. దానితో బరువు తగ్గుతారు.పాలను అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు.పాలలో బాగా పండిన అరటిపండుని చిన్న ముక్కలుగా చేసి వాటిని మిల్క్ షేక్ చేసుకోమంటున్నారు.కప్పు పాలలో ఒకటి లేదా రెండు అరటి పండ్లు వేసుకుని వాటితో పాటుగా 5 బాదం పప్పులు వేసుకోవాలి కావాలంటే ఐస్ క్యూబ్ వేసుకోవచ్చు.కాబట్టి పాలను తీసుకోకుండా ఉండకండి.