చిరంజీవి సినిమాలో మహేష్ చనిపోతాడా…

0
137
Will Mahesh Babu character will going to die

ఇప్పుడు తెలుగులోమల్టీస్టారర్స్ బాగా వస్తున్నాయి. చిరు, మహేష్ బాబు కలిసి నటిస్తున్నందుకు అభిమానులు ఆనందం ఆకాశాన్నంటుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తుండడం అభిమానులకు క్రేజ్ గా ఉంటే ఆ తరువాత వారికి చిరు, మహేష్ సినిమా కూడా అలాంటి క్రేజ్ న్యూసెనని చెప్పాలి. కొరటాల శివ చాలా జాగ్రత్తగా ఈ సినిమాను చేస్తున్నారు. ఇందులో చిరంజీవి నక్సలైట్ గా పోషిస్తున్నట్లుగా తెలిసింది. తాజాగా కొన్ని స్టిల్స్ లీక్ అవ్వడంతో అది నిజమేనని తెలుస్తుంది. ఇక మహేష్ బాబు పాత్ర ఎలా ఉండబోతుంది అనేదే ఇప్పుడు చర్చించ దగ్గ విషయం. సూపర్ స్టార్ ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపిస్తారు అనే వార్తలు మాత్రం వస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో చేయడం కోసం మహేష్ కాస్త బరువు కూడా తగ్గించుకున్నాడట. ఇందులో మహేష్ బాబు ఒక అరగంటపాటు కనిపించనున్నారు. అంతే కాకుండా అయన మంచి ఎమోషనల్ పాత్రలోకనిపించనున్నారట. కొరటాల శివ మీద ఉన్న నమ్మకం, చిరంజీవి అంటే ఉన్న ఇష్టంతో మహేష్ బాబు ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నారు. కాగా మహేష్ బాబు ఈ సినిమాలో చేయడానికి భారీగానే పారితోషకం తీసుకుంటున్నారట. అయితే మహేష్ బాబు పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తుందని ఈ పాత్ర సినిమాను మలుపు తిప్పేదిగా ఉండబోతుందని వార్తలొస్తున్నాయి. దాదాపు మహేష్ అరగంటపాటు సినిమాలో నటిస్తే అందులో చిరంజీవితో కలిసి చేసే సీన్స్ 20 నిమిషాలపాటు ఉంటాయని తెలుస్తుంది. పూజాహెగ్డే మహేష్ సరసన కథానాయకిగా నటించనుంది.

ఇదిలా ఉంటె ఇందులో మహేష్ క్యారెక్టర్ చనిపోతుంది అని, అక్కడినుండి చిరంజీవి ఎంచుకునే మార్గం సినిమా రేంజ్ ని పెంచుతుందని వార్త. మహేష్ లాంటి క్యారెక్టర్ చనిపోతుందంటే ఆ కథలో ఎంత దమ్ముందో ఇప్పటికి అర్ధం అవుతుంది. మహేష్ బాబు ఈ కేరక్టర్ కి ఒప్పుకున్నాడంటే అతనికి ఈ పాత్ర ఎంత నచ్చి ఉండాలి. ఇవన్నీ సినిమా మీద చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే 40 శాతం కంప్లీట్ అయ్యింది. మహేష్ బాబు ఈ సినిమా కోసం 30 రోజులను కేటాయించాడట. ఈ సినిమాను ఆగష్టు 14 న విడుదల చేయాలని చూస్తున్నాడట కొరటాల శివ. అయితే చిరు, మహేష్ ఇద్దరి కాంబినేషన్ ఉందా లేదా అనేది చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here