కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకోనున్నాడా..!

33
will-kohli-step-down-from-the-captaincy

తన కెప్టెన్సీలో టీమ్ వరుస పరాజయాల పాలవడంతో విరాట్ కోహ్లి తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. మొన్న చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్ లోనూ టీమ్ దారుణంగా ఓడింది. కోహ్లి కెప్టెన్సీలో ఇది వరుసగా నాలుగోసారి టెస్టు ఓడిపోవడం. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ ఆసక్తిని రేకెత్తించే వ్యాఖ్యలు చేసాడు. తర్వాతి టెస్ట్ మ్యాచ్‌లోనూ ఇండియా ఓటమి పొందితే కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని తాను అనుకుంటున్నట్లు తెలిపాడు.

కోహ్లి ప్రపంచంలోనే మేటి బ్యాట్స్‌మన్ అనడంలో ఏ మాత్రం అనుమానం లేదు. కానీ అతని కెప్టెన్సీలో టీమ్ వరుసగా పరాజయం పొందుతుంది. మరోవైపు అజింక్య రహానే కెప్టెన్సీలో ఇండియా ఆస్ట్రేలియాలో సిరీస్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో కోహ్లి తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఇప్పటికే కోహ్లి సారథ్యంలో ఇండియా వరుసగా నాలుగు టెస్టులు ఓడింది. తర్వాతి మ్యాచ్‌లో ఇది ఐదుకు చేరితే కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పకుండా తప్పుకుంటాడని నేను అనుకుంటున్నాను అని పనేసర్ అభిప్రాయపడ్డాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here