

గుండెపోటుకు గురైన బీసీసీఐ అధ్యక్షడు మరియు భారత మాజీ కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన యాంజియోప్లాస్ట్ చేయించుకున్న ఆరు రోజుల తర్వాత ఆయనను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసారు. ఈ సందర్భంగా ‘తనకు వైద్యం చేసినటువంటి వుడ్‌ల్యాండ్ ఆస్పత్రి వైద్యులకు ధన్యవాదాలు తెలియజేసారు. ప్రస్తుతం పూర్తిగ కోలుకున్నాను. ఆస్పత్రిలో వైద్యులు నా పట్ల చాల కేర్ తీసుకున్నారు. నా జీవితం తిరిగి పొందడానికి వారు సాయం చేసారు. త్వరలోనే జీవితాన్ని యధాప్రకారంగా జీవించడానికి మానసికంగా రెడీ అవుతాను అంటూ గంగూలీ తెలిపారు. అయితే గంగూలీ వరల్డ్ క్లాస్ క్రికెటర్, కనీసం ఆయనకు మద్యం, దూమపానం, ఇతర చెడు అలవాట్లు ఏమి లేవు. గంగూలీకి 48 ఏళ్ళు. మరి ఈ వయసులో గుండెపోటు రావడం అనేది యావత్ దేశాన్ని కలవరపడేలా చేసింది. చాలా మందికి అనేక ప్రశ్నలు మనసులో మెదిలాయి.
పూర్తి ఫిట్‌గా ఉండే వ్యక్తులు కూడా గుండెపోటు భారినపడతారా? అనే అనుమానం కలిగింది. అయితే కార్డియాలజిస్టు దేవీ శెట్టి దీనిపై వివరణ ఇచ్చారు. జీవితంలో ఫిట్ గా ఉన్నా ప్రతీ ఒక్కరు ఏడాదికి ఒకసారి హార్ట్ చెకప్ చేయించుకోవాలన్నారు. ‘లైఫ్‌స్టైల్‌ను ఎంత స్ట్రిక్ట్‌గా ఫాలోఅయిన అథ్లెట్ అయినా కూడా ముందుస్తు హార్ట్ చెకప్ ఎప్పుడు చేయించుకుంటూ ఉండాలి అని తెలిపారు. అలాగే గంగూలీ కూడా ముందే చెకప్ చేయించుకుని ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు. కనీసం గంగూలీని ఉదాహరణగా తీసుకుని అయినా ప్రతీ అథ్లెట్, ప్రతీ ఒక్కరు కూడా కనీసం ఏడాదికి ఒకసారైన గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోండి.’అని సూచించారు దేవీశెట్టి.