విశాల్ న్యూ మూవీ ‘చక్ర ‘ ట్రైలర్ : సైబర్ క్రైమ్ …!

0
63

విశాల్ తుప్పరివాలన్ (డిటెక్టివ్ ), అభిమన్యు ( ఇరుంబుదురై), అయోగ్య, పందెంకోడి 2 వంటి వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం విశాల్ సినిమా వస్తుందంటే అందరు ఆశక్తిగా ఎదురుచూస్తుంటారు. సమాజాన్ని అప్రమత్తం చేసేలా ఏదో ఒక కొత్త పాయింట్ తో విశాల్ సినిమాలను తెరకేక్కిన్చాడంతో సక్సెస్ సాధిస్తున్నాడు. మరోసారి అలాంటి ఓ విభిన్న ప్రయోగమే చేయబోతోన్నాడు. ప్రస్తుతం చక్ర అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మధ్య ఫస్ట్ లుక్, టీజర్ గ్లిప్స్ రిలీజ్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. గతంలో వచ్చిన సినిమాల మాదిరిగా సైబర్ క్రైమ్, రాబరీ కాన్సెప్ట్ లతో చక్ర సినిమాను ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నాడు. తాజాగా చక్ర ట్రైలర్‌ను దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్ చేశాడు. తెలుగులో ఈ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశాడు. బ్యాంకు లో దొంగతనం, సైబర్ క్రైమ్, మధ్యలో అశోక చక్ర పతాకం దొంగలించబడటం … ఈ మూడు కాన్సెప్ట్‌ల చుట్టూ చక్ర తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. కనిపించకుండా పోయిన చక్ర అవార్డు కోసం మిలటరీ ఆఫీసర్ విశాల్ పెట్టే పరుగే ఈ సినిమా. శ్రద్దా శ్రీనాథ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించినట్టు తెలుస్తోంది. ఎంఎస్ ఆనందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here