రోహిత్‌ ఊ.. అంటేనే బస్‌ కదిలేది…!

0
136
virat kohli about rohit

భారత క్రికెట్ జట్టులో బారీషాట్లను బాదడంలో రోహితశర్మకు పెట్టింది పేరు. అతను గనుక గేమ్ లో నిలబడ్డాడంటే ఇక బౌలర్ల కంటికి చుక్కల వర్షానికి లోటుండదు. రోహిత్ శర్మ గురువారం 33 లోకి ప్రవేశించాడు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమవ్వడంతో భార్య రితిక కుమార్తె సమైరాతో కలిసి కేక్ కట్ చేసాడు. 2007 వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన రాహుల్ కు క్రికెట్ ప్రపంచం మొత్తం శుభాకాంక్షలు తెలియజేసింది.

అయితే ఈ సందర్భంగా ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ రోహిత్ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను బయట పెట్టారు. రోహిత్ కు మతిమరుపు చాలా ఎక్కువట. మైదానంలో బంతిని బాదడం సంగతి పక్కన పెడితే రోహిత్ శర్మ మాత్రం తనకు సంబందించిన వస్తువులు అన్ని కూడా మర్చిపోతూ ఉంటాడట. అయన మర్చిపోయే వస్తువుల జాబితాలో పర్స్ ఇంకా ఇవే కాకుండా ఆఖరికి పాస్ ‌పోర్ట్‌ సైతం చాలాసార్లు మర్చిపోవడం జరిగిందని విరాట్ బయట పెట్టారు. దీనివల్ల టీమ్ బస్ కూడా ఎప్పుడూ ఆలస్యంగా కదలాల్సి వచ్చేది. ఇలా అనేక సార్లు జరుగుతుండడంతో జట్టు మేనేజర్ ప్రతిసారి రోహిత్ కు సంబందించిన వస్తువులన్నీ బస్ లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం జట్టు మేనేజర్ కు అలవాటైపోయింది.

అన్ని ఉన్నాయని అయన నిర్దారణకు వచ్చిన తరువాత రోహిత్ కూడా బస్ లో కూర్చున్నాడా లేదా అనేదాని కోసం రోహితశర్మ ఊ అంటేనే ఆ బస్ కూడా కదిలేది. అయితే క్రికెట్ సామాను మాత్రం రోహిత్ ఎప్పుడూ మర్చిపోలేదని విరాట్ చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here