విరాట్ కోహ్లీ ఇంట విషాదం…

0
130
Virat Kohli mourns death of pet dog ...

విరాట్, అనుష్కల పెంపుడు కుక్క బ్రూనో బుధవారం ఉదయం మరణించింది. అది దాదాపుగా 11 ఏళ్లపాటు వీరితో అనుబంధంగా గడిపింది. దీనితో బాధకు గురైన విరాట్ కోహ్లీ తన ట్విటర్ లో బ్రూనో గురించి పోస్ట్ పెట్టాడు. 11 ఏళ్ల మన ప్రయాణం జీవితాంతం మాకు ఓ తీపి గురుతుగా మిగిలిపోతుంది. నీవు ఎల్లప్పుడూ మాపై ప్రేమను కురిపించావు. నీవు చనిపోలేదు ఇక్కడినుండి వేరే చోటికి వెళ్ళావు. అక్కడ నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ బ్రూనో’ అని కోహ్లీ ఉద్వేగంతో ట్వీట్ చేసాడు. తన భార్య అనుష్క శర్మ కూడా బ్రూనో ఆత్మకు శాంతి కలగాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘మిస్‌ యూ బ్రూనో.. రిప్’ అని పేర్కొంది. ‌విరాట్ కోహ్లీ కి బ్రూనో అంటే అమితమైన ప్రేమ. కోహ్లీ బ్రునోతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఉండేవాడు.

మరో వైపు అనుష్క కూడా బ్రునోతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుండేది. అంతే కాకుండా విరాట్ కోహ్లీ ఏదైనా తనకు బాధగా అనిపించిన సమయంలో బ్రూనో తో ఆడుకుకునేవాడని అప్పుడు తన బాద అంతా మాయమయ్యేదని కోహ్లీ ఎన్నోసార్లు చెప్పాడు. విరాట్ కోహ్లీకి శునకాలంటే చాల ఇష్టం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సమయంలో బెంగుళూరులో ఉన్న శునకాల సంరక్షణ కేంద్రానికి అప్పుడప్పుడు కోహ్లీ వెళ్లి వస్తూ ఉండేవాడు. అంతే కాకుండా అక్కడి శునకాలు కొన్నిటిని దత్తత కూడా తీసుకున్నాడు. ఇక స్టేడియం లో మ్యాచ్‌లు అదే సమయంలో స్టేడియంలో తనిఖీ కోసం పోలీసుల వెంట వచ్చే శునకాలతో కోహ్లీ చాలాసార్లు ఆడుకుంటూ కనిపించాడు కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here