రకుల్‌ సినిమా సెట్స్‌ పై రాళ్లు విసిరిన గ్రామస్థులు.

15
rakul preet singh.by mirchipataka

టాలీవుడ్‌ మీద దృష్టి  తగ్గించి బాలీవుడ్‌లో బిజీ అయిపోయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం హీరో జాన్‌ అబ్రహాంతో కలిసి ‘అటాక్‌’ అనే సినిమాలో  చేస్తోంది. ముందు చేసుకున్న ప్లాన్ ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లోని ధనిపూర్‌లో యాక్షన్‌ సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. అందులో భాగంగా షూటింగ్ లో డమ్మీ బాంబ్‌ బ్లాస్టింగ్‌ జరిపారు . దీనికి తగు ముందు జాగ్రత్తలు సైతం తీసుకున్నారు. అయితే షూటింగ్‌ గురించి తెలుసుకున్న ఆ ప్రాంతం వారు  సెట్స్‌ వద్దకు చేరుకుని నటీనటులను చూడాలని ఎగబడ్డారు. దీంతో సెక్యూరిటీ గార్డులు వారిని ఆపేందుకు ప్రయత్నించగా ఆగ్రహించిన గ్రామస్తులు వారిపై దాడికి దిగారు. సెట్స్‌పైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపు చేసారు. ఈ దాడిలో సెక్యూరిటీ సిబ్బందికి  గాయాలయ్యాయి. హీరోహీరోయిన్లకు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here