సాయంలోనూ ప్రత్యేకత చాటుకున్న విజయ్‌

206

ఏది చేసినా రొటీన్ కు బిన్నంగా చేసే విజయ్ దేవరకొండ కరోనా తో అల్లాడుతున్న ప్రజలకు చేసే సేవలో కూడా తన ప్రత్యేకత చాటుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా కుటుంబం గడవడానికి కష్టంగా ఉన్న సామాన్యులను ఆదుకోవడానికి తన వంతుగా నేను మీ ముందున్నాను అంటున్నాడు. ఈ కష్ట కాలంలో రోజువారీ సరుకులు కూడా కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్న వారికోసం 25 లక్షల రూపాయలతో మిడిల్ క్లాస్ ఫండ్  ‌(ఎం.సి.ఎఫ్‌) ఏర్పాటు చేసారు. అలాగే యువతకు ఉద్యోగాలు వచ్చి వారు ఆర్ధికంగా ఎదిగే విధంగా ది విజయ్‌ దేవరకొండ ఫౌండేషన్‌(టి.డి.ఎఫ్‌)ను ఏర్పాటు చేశారు. విజయ్ దేవరకొండ దీనిని కోటి రూపాయలతో మొదలుపెట్టారు. ఈ ఫౌండేషన్ తరుపున కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి  ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారట. దీని ద్వారా తన జీవితంలో కనీసం ఒక లక్ష మంది యువతనైనా ఉద్యోగులను చెయ్యాలని విజయ్ దేవరకొండ పూనుకున్నారు. అలాగే ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో నిత్యావసర సరుకులు కూడా కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్న వారి కోసం www.thedeverakondafoundation.org ను విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసారు. దీనిలోకి లాగిన్ అయి ఇందులో వారి వివరాలు నమోదు చేసుకుంటే ఈ ఫౌండేషన్ సభ్యులు వారే స్వయంగా ఇందులో లాగిన్ అయిన వారికి సరుకులను అందజేస్తారు. ఇందులోకి లాగిన్ అయినవారు వారికి దగ్గరలో ఉన్న కిరాణాషాపులో సరుకులను గనక కొనుగోలు చేస్తే ఆ కిరానా షాప్ కు డబ్బులను ఫౌండేషన్ సభ్యులు చెల్లిస్తారు. విజయ్ దేవరకొండ మొదలు పెట్టిన ఈ ఫౌండేషన్ తో కనీసం 2000 కుటుంబాల అవసరాలైన తీర్చాలని విజయ్ దేవరకొండ టార్గెట్ పెట్టుకున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here