దృశ్యం2 రీమేక్‌లో విక్టరీ వెంకటేష్‌!.

19
victory-venkatesh-in-drusyam-2-remake

విక్టరీ వెంకటేష్ గేర్ మార్చి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో స్ట్రైట్ చిత్రాలు చేసిన వెంకీ ఈ మధ్య రీమేక్ ల పై దృష్టి సారించాడు. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలు పోషించిన దృశ్యం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసిన వెంకీ ఇప్పుడు దృశ్యం 2 చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్నాడా అనే అనుమానం అభిమానులలో ఉంది. దీనిపై ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం 2 టైటిల్ తో మూవీని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్‌లో రిలీస్ చేశాడు.

ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. దృశ్యం సీక్వెల్ మాస్టర్ పీస్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దృశ్యం 2 రీమేక్ లో నటించాలని వెంకీకు వరుస మేసేజ్‌లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దృశ్యం 2 డైరెక్టర్ జీతూ జోసెఫ్‌, నిర్మాత సురేష్ బాబుతో సహా పలువురు ప్రముఖులతో కలిసి వెంకీ దిగిన ఫొటోని రిలీస్ చేసారు. దీంతో దృశ్యం 2 చిత్రాన్ని వెంకీ రీమేక్ చేయనున్నట్టు స్పష్టమౌతుంది. కాగా, దృశ్యం 2 రీమేక్ రైట్స్‌ని సురేష్ బాబు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here