‘నారప్ప’ తర్వాత కామెడీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ ..!

287
Victory Venkatesh lines up Tarun Bhaskar

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బిగ్ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ దీనికి నిర్మాణ బాధ్యతలు తీసుకోనుంది. విక్టరీ వెంకటేష్ అంటే అందరికి చాల ఇష్టం. అయితే వెంకీ లో అందరికీ నచ్చేవి వెంకీ యాక్టింగ్ తోపాటు కామెడీ టైమింగ్. ‘F2’ మరియు వెంకీమామ సినిమాలతో మళ్ళి ఫామ్ లోకి వచ్చాడు. అయితే సురేష్ ప్రొడక్షన్స్ లో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన తరుణ్ భాస్కర్ వెంకటేష్ కోసం మంచి స్క్రిప్ట్ రెడీ చేసాడట. కద చెప్పగానే ఓకే చేశారట. అయితే ఈ సినిమాలో కూడా కామెడీకి ఏమాత్రం లోటు లేదంట.

ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమా రీమేక్ లో బిజీ గా ఉండటంతో, ఆ సినిమా నారప్ప తర్వాత పట్టాలెక్కబోతుంది. ఆ సినిమా హార్స్ రైడింగ్ నేపథ్యంలో సాగనుంది కధ వినగానే సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. మరి వెంకీ తరుణ్ కంబో కోసం వెంకీ ఫాన్స్ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here