నా బ్యాటింగ్ కు ప్రేరణ ఇతడే…!

0
123
veerendra sehwag

మన భారత్ విధ్వంసకర ఓపెనర్ ఎవరంటే చిటుక్కున చెప్తారు అందరు వీరేంద్ర సెహ్వాగ్ అని. అతనికి ఫార్మాట్ ఏదైనా బాదుడే మంత్రంగా బ్యాటింగ్ చేస్తుంటాడు. అందుకేనేమో అతడు ఏకంగా రెండు ట్రిపుల్ శతకాలు టెస్టుల్లో సాధించగలిగాడు. అయితే అతని ఫుట్ వర్క్ పై ఎన్నో విమర్శలు వచ్చేవి, ఎలాంటి పాదాల కదలిక లేకుండా భారీషాట్లు కొడుతూ పరుగుల వర్షం కురిపిస్తుండేవాడు. ఎవరెంత చెప్పినా తన తీరు మాత్రం మార్చుకునేవాడు కాదు. అయితే తన బ్యాటింగ్ కు ప్రేరణగా నిలిచినా వారు ఎవరో వెల్లడించాడు. అందరూ గవాస్కర్ నో లేక రిచర్డ్స్ నో చెబుతాడనుకుంటే ఆటను మాత్రం వేరే పేరు చెప్పాడు.

ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ ఉండటం వలన దూరదర్శన్ లో రామాయణ సీరియల్ వస్తోంది. అందులో రావణుడి దర్బార్ లో అడుగుపెట్టి తన పాదాన్ని పైకి లేపితే ఓటమిని అంగీకరిస్తానని అదేవిధంగా తన సైన్యాన్ని కూడా తీసుకెళ్ళిపోతానని అంగధుడు సవాల్ విసురుతాడు. కానీ అతని పాదాన్ని ఎవ్వరు లేపలేకపోతారు. అదేవిధంగా తన ఫుట్ వర్క్ కు లంకె పెడుతూ వీరు ట్వీట్ చేసాడు. నా బ్యాటింగ్ కు ప్రేరణగా ఎవరు నిలిచారో చూసారుగా, అంగధుడి పాదాన్ని కదపడం కష్టమే కాదు, అసంభవం అంటూ అంగధుడి ఫోటోను ట్విట్టర్ పోస్ట్ చేసాడు వీరూ.

దాంట్లో రావణుడి దర్బార్‌లో అడుగుపెట్టిన అంగధుడు తన పాదాన్ని పైకి లేపితే ఓటమిని అంగీకరించి తన సైన్యాన్ని తీసుకెళ్లిపోతానని సవాల్‌ విసురుతాడు. కానీ ఎవరూ అతడి పాదాన్ని లేపలేకపోతారు. దీనికి, తన ఫుట్‌వర్క్‌కు లంకె పెడుతూ వీరూ ట్వీట్‌ చేశాడు. ‘నా బ్యాటింగ్‌కు ప్రేరణగా ఎవరు నిలిచారో ఇక్కడ చూడండి, అంగధుడి పాదాన్ని కదపడం కష్టమే కాదు. అసంభవం’ అంటూ అంగధుడి ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here