ఉప్పెన మూవీ టాక్ : కృతిసెట్టి టాలెంట్ ముందు అందరూ హుష్ కాకే..

35
uppena-movie-surprise-movie-talk

సాయిధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ లో మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఉప్పెన టైటిల్ తో వచ్చిన వైష్ణవ్ సినిమాపై మంచి నమ్మకాన్ని పెట్టుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆల్రెడీ కొన్ని చోట్ల సినిమాకు మంచి టాక్ వచ్చిందని తెలుస్తుంది. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చి బాబు సన డైరెక్ట్ చేసిన ఈ ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించింది కృతి శెట్టి. అమ్మడికిది మొదటి సినిమానే అయినా చాలా బాగా నటించిందని తెలుస్తుంది. ఆల్రెడీ ప్రచార చిత్రాల్లోనే ఆమె ప్రేమలో పడిపోయారు తెలుగు ఆడియెన్స్.

ఇక ఇదిలాఉంటే ఉప్పెన ప్రీమియర్స్ చూసిన వారంతా కూడా కృతి శెట్టి పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. సినిమాలో అమ్మడు చేసిన బేబమ్మ పాత్ర మరెవరు ఈ రేంజ్ లో చేయలేరని చెబుతుంది. మొదటి సినిమాతోనే తనలోని టాలెంట్ ప్రూవ్ చేసుకునేలా కృతి శెట్టి ఉప్పెనతో మంచి అవకాశాన్ని అందుకుందని అంటున్నారు. సినిమా అంతా తన టాలెంట్ తో మెప్పిస్తుందని టాక్. మొదటి సినిమా అయినా కూడా కృతి శెట్టి అభినయం ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. సినిమా చూసిన తర్వాత అందరు బేబమ్మ ఫ్యాన్ అయిపోవడం పక్కా అంటున్నారు.

టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఎప్పుడూ ఉండేదే అలాంటి టైం లో కృతి శెట్టి అడుగుపెట్టింది. అమ్మడి ఫాలోయింగ్, క్రేజ్ చూస్తుంటే ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న పూజా హెగ్దే, రష్మిక మందన్నలను కూడా పక్కన పెట్టి తను అవకాశాలు కొట్టేసేలా ఉంది. ఉప్పెన రిలీజ్ అవకుండానే నాని శ్యాం సింగ రాయ్, సుధీర్ బాబు సినిమాల్లో ఛాన్స్ అందుకున్న కృతి శెట్టి తప్పకుండా ఉప్పెన రిలీజ్ తర్వాత టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారుతుందని మాత్రం చెబుతున్నారు. ఉప్పెన సినిమాకు అన్ని దగ్గర ఉండి నడిపించిన సుకుమార్ కు ఈ సినిమా హిట్ క్రెడిట్ లో భాగం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here