అయోధ్య లో రామ మందిర నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం..!

0
140
UP govt approves Rs 450-crore budget for 221-metre tall Ram

న్యూఢిల్లిలోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది చైత్ర నవరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తరువాత శ్రీరాములవారి విగ్రహాన్ని రామ జన్మభూమి ప్రాంగణంలోనికి తరలించారు. ఆదిత్యనాథ్ స్వయంగా తన చేతుల మీదుగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆలయంలోనికి రాముని విగ్రహాన్ని తరలించారు. 9.5 కిలోల సింహాసనంఫై రాముని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సింహాసనాన్ని శ్రీరామతీర్ధ క్షేత్ర ట్రస్టు లో సభ్యుడైన రాజ అయోధ్య విమలేంద్ర మోహన్ మిశ్రా బహుమతిగా ఇచ్చారు.

జైపూర్ కు చెందిన కళాకారులు ఈ సింహాసనాన్ని తయారు చేశారు. రామమందిర నిర్మాణం పూర్తయ్యే వరకు రామ విగ్రహాన్ని ఈ తాత్కాలిక నిర్మాణం లోనే ఉంచనున్నారు. ఈ కార్యక్రమాన్ని జరిపించడం కోసం ఆదిత్యనాథ్ మంగళవారం రాత్రే అయోధ్యకు చేరుకున్నారు దీనికోసం ఆయన పదకొండులక్షల విరాళాన్ని అందజేశారు.

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సందర్భముగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. శ్రీరామ జన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వారు భూమి పూజ ఏప్రిల్ మొదటి వారంలో ప్రకటిస్తామని ఇదివరకే ప్రకటించారు. అయితే ప్రధాన మంత్రి లాక్ డౌన్ ప్రకటించిన కొద్ది గంటలలోనే ముఖ్యమంత్రి ఈ విధంగా పుజా కార్యక్రమంలో పాల్గొనటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here