చేగువేర గురించి ఆసక్తికర నిజాలు..! | Untold Facts about Che Guevara

516
Remembering Che Guevara

చేగువేర ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విప్లవ యోధుడు. గెరిల్లా పోరాట సింహం సామ్రాజ్యవాదం ప్రపంచానికి శత్రువన్నాడు. దోపిడీ లేని వ్యవస్థ కోసం కలలుగన్నాడు. ఆయుధ పోరాటమే మార్గమని నమ్మి గెరిల్లా పోరాటాలకు రూపకల్పన చేశాడు. సామ్రాజ్యవాదంపై ఏ దేశం విజయం సాధించినా అది అందరి విజయం ఎవరు ఓడినా అది అందరి ఓటమి అని వెలుగెత్తి చాటిన గొప్ప దార్శనికుడు. చేగువేర మార్క్సిస్టు భావజాలంతో లాటిన్ అమెరికా ఆఫ్రికా దేశాలలో స్వాతంత్య్రం లేక మగ్గుతున్న ఎన్నో దేశాలకు విప్లవ పోరాటాలను పరిచయం చేశాడు. పోరాటానికి..చావుకు సరిహద్దులుండవన్నాడు. మరణం ఎప్పుడు పలకరించినా స్వాగతిస్తానన్న ధీరుడు. కానీ తన చేతిలోని ఆయుధాన్ని వేరొకచేయి అందుకోవాలన్నాడు. విప్లవం కోసం జీవించాడు. విప్లవంలోనే నేలకొరిగాడు. విప్లవానికి సింబల్ అయ్యాడు.

క్యూబాను అమెరికా ద్రాస్యశృంఖలాలనుండి విడిపించి ప్రజాస్వామ్య స్థాపనకోసం కృషిచేసిన చేగువేర మాతృదేశం అర్జెంటీనా కానీ క్యూబా ఆయనని గుండెల్లో పెట్టుకుని పూజిస్తుంది. ఫిడెల్ క్యాస్ట్రో కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. చేగువేర అసలు పేరు ‘ఎర్నెస్టో గువేరా’. MBBS చదివి ఎన్నో ప్రాణాలను కాపాడాల్సిన చేతితో గన్నుపట్టుకున్న అరుదైన వ్యక్తి చేగువేర. కమ్యూనిస్టు ఫ్యామిలీ నుండి వచ్చిన తల్లిదండ్రులనుండి చిన్నప్పటినుండి విప్లవ వీరులగాధలు వింటూ పెరిగాడు. తన మాతృదేశం అర్జెంటీనా పేదరిక మూలాల గురించి అన్వేషిస్తూ అర్జెంటీనా వ్యాప్తంగా మొత్త్తం 2800 మైళ్ళు సైకిల్ యాత్ర చేశాడు. తర్వాత తన ప్రేయసి చిన్ చీనా సహాయంతో 500 సీసీ బైక్ పై లాటిన్ అమెరికా యాత్ర చేపట్టాడు.

అనేక దేశాలలో 8000 కిలోమీటర్లకుపైగా తిరిగాడు. Dark Facts About Che Guevaraతొమ్మిది నెలలకుపైగా సాగిన మోటారుబైకు యాత్రను డైరీ రూపంలో ట్రావెల్ డైరీస్ రాశాడు. చేగువేర “ది మోటార్ సైకిల్” అనే పేరుతో విడుదలైన బుక్స్ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా అమ్ముడుపోయాయి. డాలర్ డెమోక్రసి… డబ్బు ఉన్న వాళ్ళకు స్వర్గం పెద్ద వాళ్ళకు నరకం అని తన డైరీస్ లో రాశాడు. ఆ యాత్ర తర్వాత 1953 జూన్ 12 న డాక్టరేట్ పట్టా పొందాడు. 1953 జులై 7 న ఇంట్లో అందరితో భోజనం చేసి తన చిరకాల మిత్రుడు దగ్గరకి వెళ్తున్నాను అన్ని చెప్పి ఇంట్లోనుండి వెళ్ళిపోయాడు. ఆదే తన కుటుంబంతో ఇక చివరి చూపు. ఇక అక్కడినుండి పూర్తిస్థాయి విప్లవకారుడిగా మారాడు.

కుష్టువ్యాధి నిపుడిగా పేదలకు సేవచేయాలనుకున్న చేగువేరా దానికన్నా ముందు వ్యవస్థకి పట్టిన కుష్ఠుని వదిలించాలని బయల్దేరాడు. అయితే మరి చెగువేరాకి స్ఫూర్తినిచ్చింది మాత్రం ఓ పనిమనిషి! ఏంటి, నమ్మట్లేదు..కదా? అదే నిజం..! తన పేషంట్ల బట్టలు ఉతికే ఒక పనిమనిషి కష్టాలను దగ్గరనుండి చుసిన వ్యక్తిగా చలించిపోయాడు. ఆపనిమనిషి జీవితమే తనను విప్లవం వైపు మళ్ళేలా చేసిందట. ఇక చేగువేరా ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అంటే అది లైబ్రరీ ఒక్కటే. ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటాడు. చేగువేరా చిన్నప్పటినుండి ఆస్తమా తో బాధపడేవాడు. చల్లటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడల్లా దగ్గు,తుమ్ములతో బాధపడేవాడు. దానికి విరుగుడుగానే సిగర్ ను అలవాటు చేసుకున్నాడు. అంతేగాక చిన్నప్పటినుండి అన్ని ఆటలలో ప్రావిణ్యం పొందాడు.

చెగువేరాది విలక్షణమైన వ్యక్తిత్వం. వ్యూహాలు రచించడంలో దిట్ట నల్ల జాతీయులను కట్టుబానిసలుగా మార్చుకున్న అమెరికా నుండి విముక్తి పొందేలా అనేకదేశాలలో విస్తృత ప్రచారాలు చేశాడు. వాటిలో కొన్ని ఫలించాయి మరికొన్ని వికటించాయి. అనేక యూనివర్సిటీల్లో అతని స్పీచ్ కి ఎంతోమంది ముగ్దులైయ్యారు. డబ్బుకి ఎక్కువ విలువ ఇవ్వొద్దని, డబ్బుకోసం ఎక్కువ పనిగంటలు కూడా పనిచేయొద్దని అంటుంటాడు. విప్లవ పోరాటాలే కాకుండా లింగ వివక్ష, సామ్యవాదం, భౌతికవాదం, సమతావాదం వంటి వాటిపై ఖచ్చితమైన అభిప్రాయంతో ఉండేవాడు.

అతని భావజాలం అమెరికాకు కంటగింపుగా మారింది. అందుకేనేమో అతనిని అతి కిరాతకంగా అంతమొందించింది. నిజం చెప్పాలంటే అమెరికా ద్వేషించినంతగా ఇంకే దేశం అతనిని ద్వేషించలేదు. అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా ఎలా చేసాడో అర్ధం చేసుకోవచ్చు. చివరికి 1960 లో అక్టోబర్ 9న చేగువేర ని కాల్చి చంపే సమయంలో కూడా ఎంతో నిబ్బరంగా, దైర్యంగా ఉన్నాడు అని చేగువేరని కాల్చిన టెరాన్ తెలిపాడు. అలా ఒక యోధుడు నేలకొరిగాడు. లాటిన్ అమెరికా దేశాలతో పాటు సోవియట్ అమెరికా, బ్రిటన్ దేశాల ద్రాస్యశృంఖలాలో ఉన్న ఎన్నో దేశాలలో స్ఫూర్తిని రగిలించాడు చేగువేర. చేగువేర మరణించి

అయిదు దశాబ్దాలు అవుతున్నా ఆ విప్లవయోధున్ని ప్రపంచం ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోదు. మరి అలాంటి చరిత్రకారుడిని ఎందరో స్ఫూర్తి తీసుకోవాలని ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యలను ఎదుర్కొనేలా ఉండాలని కోరుకుంటూ మీ మిర్చిపటాకా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here