

నాని-శివ నిర్వాణ కాంబినేషన్లో ‘నిన్ను కోరి’ ఎంతలా అలరించిందో సినీ లవర్స్ కి తెలిసిందే. ఇంకోసారి వీళ్లిద్దరు ప్రేక్షకుల ముందు సందడి చేసేందుకు రెడీ అయ్యింది.అన్నదమ్ముల కథతో నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు పురస్కరించుకొని ఒక రోజు ముందుగా చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు. ఒక డైలాగ్ కూడా లేకుండా పాటతో చిత్ర నేపథ్యం ఏంటో చెప్పేశారు.
నిన్ను చూసి నికరంగా రొమ్ము ఇరుచుకున్నాది’ అంటూ తన కుటుంబం కోసం టక్ జగదీష్ ఏం చేశాడో చూపించారు. షైన్స్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది స్వయంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదల కానుంది. ఆసక్తికరంగా సాగిన ‘టక్ జగదీష్’ టీజర్‌ని మీరూ చూసేయండి.