రామ్ చరణ్ తో మొదటిసారి త్రివిక్రమ్ … ఎన్టీఆర్ తర్వాత అదే ప్రాజెక్ట్ …!

0
70

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. మళ్ళి మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కథతో రాబోతున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్ ని కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. త్వరలో త్రివిక్రమ్ .. రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. గతంలోనే వీరి కాంబినేషన్ లో ఒక బిగ్ ప్రాజెక్ట్ రానున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఫైనల్ గా రామ్ చరణ్ కి ఇటీవల ఒక లైన్ వినిపించిన త్రివిక్రమ్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో తప్పకుండా చేద్దామని ఒక ఒప్పందానికి కూడా వచ్చినట్లు సమాచారం. అయితే RRR తర్వాత ఒక సినిమా చేసిన అనంతరం త్రివిక్రమ్ తో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ మధ్యలో రామ్ చరణ్ మరో దర్శకుడికి కమిట్ అయినట్లు టాక్. మరోవైపు త్రివిక్రమ్ కూడా వచ్చే ఏడాది జూనియర్ తో బిజీ గా ఉంటాడు కాబట్టి రామ్ చరణ్ సినిమా సెట్స్ పైకి రావడానికి మినిమమ్ రెండేళ్లు పట్టవచ్చు. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని ఆడియన్స్ తోపాటు సినీ ప్రముఖులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here