సముద్రంలో 1100 కి.మీ ప్రయాణం.. తీరం చేరిన వెంటనే…

141
Travel 1,100 Km On Boat To Reach Home.

లాన్‌డౌన్ సమయంలో ఇంటినుంచి బయటకు రాకండి అని అధికారులు చెబుతున్నా కొందరు వినిపించుకోవడం లేదు. సముద్రమార్గంలో కొందరు జాలర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. మొత్తం 39 మంది జాలర్లు బోటులో సముద్రంలో ప్రయాణించారు. తమ స్వస్థలం చేరుకునేందుకు దాదాపు 1100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది.

25 మంది జాలర్లు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన వారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 మంది జాలర్లు కలిసి ఈ నెల 24వ తేదీన వేట కోసం సముద్రానికి వెళ్లారు. వీరంతా చెన్నై చేరుకొని. అక్కడే బోటు అద్దెకు తీసుకొని వెళ్లారు. కానీ వేట సాధ్యం కాకపోవడంతో 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఇచ్చాపురంలో కొందరు మత్స్యకారులు దిగిపోయారు. పాటి సొనెపూర్‌లో మరికొందరు శనివారం దిగిపోయారు. మిగతావారు ఒడిశా గంజానికి సోమవారం వచ్చారు. వీరి గురించి తెలుసుకున్న అధికారులు. వెంటనే వారి గురించి ఆరాతీశారు. వారికి ఆహారం అందజేశారు తర్వాత వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. గమ్యం చేరుకునేందుకు జార్లు ఉపయోగించిన బోటును కూడా సీజ్ చేశారు.ఏపీకి చెందిన 14 మంది జాలర్లు డాంకూరులో దిగిపోయారని అధికారులు తెలియజేసారు.మొత్తం 39 మంది జాలర్లను ఆయా ప్రాంతాల్లో క్వారంటైన్ చేసినట్టు పేర్కొన్నారు. జాలర్ల ఘటనతో ఒడిశా ప్రభుత్వం ఉలిక్కిపడింది. తీరప్రాంతాల్లో గస్తీని మరింత కఠినం చేయాలని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here