దళపతి విజయ్ లుక్ లో టాప్ స్పిన్నర్ అశ్విన్..

18
top-spinner-ashwin-in-dalapati-vijay-look

చెన్నై వేదిక గా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించింది. 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సొంతం చేసుకుని సిరీస్ ను 1-1తో సమం చేసింది కోహ్లీ సేన. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ విల విలలాడారు. అయితే ఈరోజు రెండో టెస్టు లో భారత్ గెలుపొందడంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేర్లలో ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకరు. తన సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో అశ్విన్ ఆల్ రౌండర్ గా నిలబడి అదరగొట్టాడు.

తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ ను దెబ్బకొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో కీలక సమయంలో ఏకంగా సెంచరీ సాధించి భారత్ రెండో టెస్టు గెలవడానికి కారణమయ్యాడు. దీంతో అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ క్రమంలో అశ్విన్ భార్య ప్రీతి అశ్విన్ చేసిన ఓ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా మాస్టర్ పోస్టర్ ను ఎవరో మార్పింగ్ చేసి విజయ్ ప్లేస్ లో అశ్విన్ ఫోటోను ఉంచారు. ఆ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ప్రీతి ఇలా చేసింది ఎవరు అంటూ ఓ స్మైలీ ఎమోజీని జత చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here