టాలీవుడ్ కి దసరా పండగ…

0
46
Tollywood Movies Releasing from Dasara festival

సంక్రాంతి పొతే పాయిందిలే తరువాత వేసవి ఉందని సంబర పడ్డారు. కానీ ఈసారి వేసవి పూర్తిగా నీరు కార్చేసింది. మహమ్మారీ రంగ ప్రవేశంతో టాలీవుడ్ అంతా అతలాకుతలంగా మారిపోయింది. థియేటర్లు బంద్.. షూటింగుల బంద్ లాంటి దారుణ పరిస్థితి ఏర్పడింది. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే అన్ లాక్ 4.0 పేరుతో సినీపరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఇక థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరుచుకునే పరిస్థితి ఏర్పడింది. శుభలేఖలు పంచేసాం తన్నుకు చావండి! అన్న చందంగా కేంద్రం నుండి వీటికి క్లియరెన్స్ వచ్చే సమయం తొందరలోనే ఉందని అర్థమవుతోంది. అక్టోబర్ 15 నుండి థియేటర్లను తిరిగి తీర్చుకోవడానికి కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందని వార్తలు గట్టిగానే వినపడుతున్నాయి. అనుమతులు మంజూరు అయిన వెంటనే మల్టీ ప్లెక్స్ లు తిరిగి తెరుచుకుంటాయి. హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు ముందుగా ప్రదర్శిస్తారు.


టాలీవుడ్ ఎగ్జిబిటర్లు దసరా నుండి థియేటర్లను తెరిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసే ప్రయత్నాలలో ఉన్నారని తెలుస్తోంది. థియేటర్లకు జనం నిండుగా వస్తారా లేదా అన్నది ఒకసారి పరీక్షించుకుంటారట. ఒకసారి థియేటర్లు తెరిస్తే.. దీపావళి.. దసరా బరిలో వరుసగా సినిమాలు విడుదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే క్రిస్మస్ వరకూ హిందీ- ఇంగ్లీష్ చిత్రాలతో పాటు కొన్నితెలుగు సినిమాల్నిసైతం రిలీజ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వకీల్ సాబ్.. ఉప్పెన.. రెడ్ వంటివి సంక్రాంతి వరకూ రాకపోవచ్చని తెలుస్తోంది. అయితే చాలా చిన్న మిడ్ రేంజ్ సినిమాలు మాత్రం రిలీజయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇక అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు లాంటి వారి విశ్లేషణ మేరకు.. థియేటర్లు ఓపెన్ చేయకపోవడం మంచిదా లేక తెరిస్తే సక్సెస్ అవుతుందా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. కనీసం దసరా కాకపోయినా సంక్రాంతికి అయినా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేకపోలేదని అందరి ఆలోచన. అందాకా కాస్త ఆగాలి మరి అన్న ఆలోచనలో జనాలకు ఉంటే దసరా క్రిస్మస్ బరిలో సినిమాలు విడుదలయిన పెద్దగా ఉపయోగం లేకపోవొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here