

టాలీవుడ్ లో సినిమాలకి కొదవే లేదు. హీరో శ్రీవిష్ణు తన కొత్త సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. శ్రీవిష్ణు ఈ మధ్య ఫుల్ స్పీడ్ లో ఉన్నట్టు అర్ధమవుతుంది. తాను మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గ తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఇపుడు హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. ఇండస్ట్రీ లో ఎవరి సాయం తీసుకున్నా..తనకంటూ ఒక స్టైల్ ఇమేజ్ లేకపోతె నిలబడలేరు. కానీ విష్ణు తాను ఎంపిక చేసుకునే కథలతో తనకంటూ ఒక గుర్తింపుని క్రియేట్ చేసుకోగలిగాడు. శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుంది అంటే ఏదో వైవిధ్యత కొత్తదనం ఉంటాయనే స్థాయిలో ఉన్నాడు.
తాను రిలీజ్ చేసిన “తిప్పరా మీసం” చిత్రం ఈరోజు రిలీస్ అయింది. ఫుల్ పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. యుస్ ప్రీమియర్ షో లు ఆల్రడీ రిలీజ్ అయ్యాయి. సినిమా చుసిన ప్రేక్షకులు వారి అభిప్రాయాల్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. శ్రీవిష్ణు కి మరో హిట్ పడిందనే చెప్పుకోవచ్చు.
హీరో కి తల్లికి మధ్య సెంటిమెంట్ సీన్స్ బాగా పండించారంట. హీరో తల్లిగా నటి రోహిణి నటించింది. సినిమా ఆఖరి 30 నిమిషాలు అయితే చెప్పడానికి మాటలు సరిపోవు అంటున్నారు. అలాగే, ఇంటర్వెల్ సీన్ అయితే బాక్సు బద్దలైపోవడం ఖాయమని ఒక ప్రేక్షకుడు ట్వీట్ చేశారు. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచిందని టాక్।
చూద్దాం.. మరి ఈమేరకు ఈ చిత్రం నిలబడుతుందో శ్రీవిష్ణు ఏ రేంజ్ లో సక్సెస్ సాదిస్తాడో..!