

ఐపీఎల్ 2019 లో తృటిలో చేజారిపోయిన టైటిల్ ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తుంది చెన్నైజట్టు. ముంబై ఇండియన్స్ తర్వాత అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. అయితే ఈసారి ఈ జట్టు కొంచెం మార్పులతో బరిలోకి రానుంది. కేవలం నలుగురు ఆటగాళ్ళను మాత్రమే కొనుగోలు చేసింది. ఇందులో ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ కర్రమ్ ను 55 కోట్లకు చేజిక్కించుకుంది. గత సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి ఆడిన ఈ ఆల్రౌండర్ ఈసారి చెన్నై జట్టులో మెరవనున్నాడు.
టీమ్ ఇండియా లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ను 67 కోట్లకు చేజిక్కించుకుంది. తర్వాత ఆస్ట్రేలియా పేసర్ హాజల్ వుడ్ ను 2 కోట్లకు చేజిక్కించుకుంది. తమిళనాడు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ సాయి కిషోర్ ను కూడా 20 లక్షలకు దక్కించుకుంది. ఇక మిగిలిన ప్లేయర్స్ అందరూ పోయినసారి టీమ్ లో ఉన్నవాళ్ళే. అంతకుముందు వేలం తర్వాత ఈసారి వేలం కి ముందు చెన్నై దగ్గర 14.15 కోట్ల రూపాయలుండగా, ఈసారి వేలం లో కేవలం నలుగురు ప్లేయర్స్ కోసం 14 కోట్లు ఖర్చుచేసింది. ఇంకా ఇప్పుడు చెన్నై వద్ద కేవలం 15 లక్షలు మాత్రమే ఉన్నాయి.
FINAL SQUAD :
Narayan Jagadeesan, Ruturaj Gaikwad, KM Asif, Ravindra Jadeja, M Vijay, MS Dhoni, Josh Hazlewood, Kedar Jadhav, Harbhajan Singh, Karn Sharma, Piyush Chawla, Ambati Rayudu, Suresh Raina, Imran Tahir, Deepak Chahar, Faf du Plessis, Shardul Thakur, Mitchell Santner, Dwayne Bravo, Lungi Ngidi, Sam Curran, Monu Kumar, Shane Watson, Sai Kishore.