ఈసారి హోరాహోరీనే అంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీం..!!

0
168
IPL 2020 players list

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే పేక్షకులకు వచ్చే జోష్ వేరు. సిక్సులు ఫోర్లతో తడిసిముద్దయ్యే ఈ పొట్టి క్రికెట్ కి ఉండే ఫాలోయింగ్ వేరు. ఇప్పుడు పదమూడవ సీజన్ కోసం జరిగిన వేలం లో తమకు కావలసిన ప్లేయర్లను పోటీపడి మరీ గెలుచుకున్నాయి. పోయినసారి IPL లో మంచి పోటీ ఇచ్చిన ఢిల్లీ, ఈసారి కూడా మంచి ఆటగాళ్ళని అమ్ముల పొదలో వేసుకుంది. ఈసారి ఢిల్లీ టీమ్ లో శిఖర్ ధావన్, అజంక్యా రహానే, అశ్విన్, మిశ్రా మరియు ఇషాంత్ శర్మ వంటి ఇండియన్ ఆటగాళ్లున్న ఈ టీమ్ కి యువ ఆటగాడైన శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు.

ఢిల్లీ ఈసారి వేలంలో వెస్ట్ ఇండీస్ ఆటగాడైన హేట్మేయర్ ను అత్యధికంగా 7.75 కోట్లకి కొనుగోలు చేసింది. కరేబియన్ ఆటగాడైన హేట్మేయర్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ పొట్టి ఫార్మాట్ కి సరైన యోధుడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టయినిస్ ని కోటి రూపాయలకు చేజిక్కించుకుంది. మరో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ క్యారీ ని 2.24 కోట్లకు దక్కించుకుంది. చివరి ఓవర్లలో అలెక్స్ విధ్వంసం అద్భుతం.

ఇంగ్లాండ్ ఆటగాళ్ళైన క్రిస్ వోక్స్ మరియు జాసన్ రాయ్ లను చెరో 1.5 కోట్లకు దక్కించుకుంది. మోహిత్ శర్మ ని 50 లక్షలకి దక్కించుకోగా.. తుషార్ దేష్పాండే, లలిత్ యాదవ్ లను చెరో 20 లక్షలకు దక్కించుకుంది. కగిసో రాబాద, అక్షర్ పటేల్, కీమో పాల్, సందీప్ లామిచ్చానే వంటి బౌలింగ్ లైనప్ కి కొత్త బౌలర్లు తోడవడం ఢిల్లీని పటిష్టంగా చేశాయి. అన్ని విభాగాల్లోనూ ఎంతో పటిష్టంగా ఉన్న ఢిల్లీకి ఇదే సరైన ఛాన్స్ అంటున్నారు ఢిల్లీ ఫాన్స్. మరి ఫాన్స్ కోరికను ఈసారైనా నెరవేరుస్తారేమో చూడాలి..!

DC Team 2020 Players List :
Shikhar Dhawan, Ajinkya Rahane, Prithvi Shaw, Shreyas Iyer, Jason Roy, Rishabh Pant (wk), Alex Carey (wk), Shimron Hetmyer, R Ashwin, Amit Mishra, Sandeep Lamichhane, Kagiso Rabada, Ishant Sharma, Keemo Paul, Avesh Khan, Mohit Sharma, Tushar Deshpande, Axar Patel, Harshal Patel, Marcus Stoinis, Lalit Yadav and Chris Woakes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here