బాలీవుడ్ లో రీమేక్ కానున్న ఉప్పెన.

15
Uppena-remade-in-Bollywood.by mirchipataka

మెగా మేనల్లుడు నటించిన ఉప్పెన సినిమా ఇప్పటికే రూ.70 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటుతోంది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లో కూడా రీమేక్‌ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే తన కుమారుడు సంజయ్‌ను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేయాలని తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ అనుకుంటున్నట్లుగా సమాచారం. చిత్ర యూనిట్ తో ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు జరుపుతున్నట్లుగా టాక్‌. మొదట ఈ సినిమాను టాలీవుడ్‌తో పాటు తమిళ్‌లో కూడా రిలీస్ చేయాలని అనుకోగా విజయ్ సేతుపతి మాత్రం వద్దని సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కథ చాల బాగుందని, డబ్‌ చేయడం కంటే కూడా రీమేక్‌ చేయడం వలన మంచి వసూళ్లను రాబట్టవచ్చని సలహా ఇచ్చారట. అంతేకాకుండా తమిళ రీమేక్‌ రైట్స్‌ను కూడా స్వయంగా విజయ్‌ సేతుపతి తీసుకోబుతున్నట్లు సమాచారం. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఉప్పెన సినిమా రీమేక్‌ చేయాలని భావిస్తున్నారట. ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే ఇందులో హీరోహీరోయిన్లుగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here