

తెనాలి రామకృష్ణుడు అలరిస్తాడు కానీ..!!
Release Date: నవంబర్ 15, 2019
MirchiPataka Rating: 2.75/5
నటీనటులు : సందీప్ కిషన్, హన్సిక మోత్వానీ, వరలక్ష్మీ శరత్ కుమార్,మురళి శర్మ, వెన్నెల కిషోర్,పోసాని, సప్తగిరి, ప్రభాస్ సత్యం, చమ్మక్ చంద్ర,రఘు బాబు, అన్నపూర్ణ,కిన్నెర తదితరులు
దర్శకత్వం : జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు : అగ్రహారం నాగి రెడ్డి, కె.సంజీవ రెడ్డి
సంగీతం : సాయి కార్తీక్
సినిమాటోగ్రఫర్ : సాయి శ్రీరామ్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
సందీప్ కిషన్ కొత్త మూవీ తెనాలి రామకృష్ణుడు బిఏఎల్ఎల్బి టైటిల్ తోనే ఆకట్టుకునేలా చేసారు చిత్ర యూనిట్. సందీప్ కిషన్ నుండి మొన్న వచ్చిన యాక్షన్ అండ్ త్రిల్లర్ మూవీ “నిను వీడను నేను” సినిమా పర్లేదు బానే ఉంది అనిపించుకుంది. ఆ చిత్రం తర్వాత వస్తున్నఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రమని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు.
ఇక ఈరోజు విడుదల అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో నడుస్తుంది. ప్రథమార్థం మొత్తం నవ్వులు పూయిస్తుందట. తన తెలివి తేటలతో పెండింగ్ లో ఉన్న కేసులు మరియు బయట చిన్న చిన్న సెటిల్ మెంట్లు చూసుకుంటూ డబ్బులుసంపాదిస్తుంటాడు హీరో. ఏమీ తెలియకపోయిన ఎదో తెలిసినట్టు నటిస్తూ, ఏదో చేసేయాలి.. ఏకంగా జడ్జి అయిపోవాలి అనే పాత్రలో హీరో ఇన్ హన్సిక చక్కగా నటించారట..! సప్తగిరి తన కేసు గురించి సందీప్ కిషన్ కి అప్పగిస్తారట. ఐతే ఈ కేసు విషయంలో తెనాలి రామకృష్ణకు ఊహించని విషయాలు తెలుస్తాయి. ఏమిటా విషయాలు? జర్నలిస్ట్ ని నిజంగా చంపింది ఎవరు? జర్నలిస్ట్ ని చంపిన వారిని చట్టానికి తెనాలి రామ కృష్ణ అప్పగించాడా లేదా అనేది? తెరపైన చూడాలి. ఆ కేసు వాదించడం వారి మధ్య కామెడీ వెంకటాద్రి సినిమా తరహాలోలా బాగా పండించారట. చిత్రం లో ఉన్న మిగిలిన తారాగణం మొత్తం పెర్ఫార్మన్స్ పరంగా బాగా చేశారట. వారిని ఫస్ట్ హాఫ్ లో ఉపయోగించుకున్నంత సెకండ్ హాఫ్ లో లేదట..!
ప్రథమార్థం లో హన్సికా సందీప్ ల మధ్య రొమాన్స్, కామెడీ, సందీప్ కిషన్ డాన్సులు, చిత్ర మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయట. కానీ దర్శకుడు ద్వితీయార్థం లో సినిమాని మలచిన తీరు అనుకున్నంత లేదు అని టాక్. అసందర్భపు కామెడీ విసిగిస్తుందట. డైరెక్టర్ సెకండ్ హాఫ్ కూడా కామెడీ కొంచెం పెంచి కధ రాసుకుని ఉండుంటే వేరేలా ఉండేదట. సినిమా మొత్తం మీద ఫస్ట్ హాఫ్ హిట్.. సెకండ్ హాఫ్ ఫట్..అని టాక్.