

టాలీవుడ్లో ఉన్న క్రేజీయెస్ట్ దర్శకులలో తేజ ఒకరు. దర్శకుడు గా చిత్రం సినిమాతో అడుగుపెట్టిన తేజ. నితిన్, ఉదయ్ కిరణ్, రీమా సేన్, సదా, కాజల్, నవదీప్, సుమన్ శెట్టి లాంటి నటీనటులతో పాటు గా ఆర్పి పట్నాయక్ వంటి సంగీత దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళుతున్న తేజ చివరి మూవీ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి హిట్ కొట్టారు. బెల్లం కొండ శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్స్‌గా సీత సినిమా తోను అలరించాడు.రానాతో ఓ సినిమా ఉంటుందని ప్రకటించిన తేజ తాజాగా చిత్రం సినిమా సీక్వెల్‌ని తన బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేశాడు. చిత్రం 1.1 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం 2021లోనే షూటింగ్ జరుపుకోనుంది.
తొలి పార్ట్‌కి సంగీతం అందించిన ఆర్పీ పట్నాయక్ ఇప్పుడు సీక్వెల్‌కి సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు.నటీనటులు ఎవరనే దానిపై క్లారిటీ ఇంకా రావాలి.తేజ తెరకెక్కించిన చిత్ర మూవీ 2000 జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూన్ 16ki 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన మూవీ ఉదయ్ కిరణ్, రీమాసేన్, ఆర్.పి.పట్నాయక్, రసూల్ ఎల్లోర్ వంటి వారి కెరీర్‌కు పునాది వేసింది.