2020 లో టీం ఇండియా షెడ్యూల్ ఖరారు..!

438
Team India Schedule in 2020

2020 లో టీం ఇండియా షెడ్యూల్ ఖరారు అయింది. టి 20 వరల్డ్ కప్ తోపాటు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా & శ్రీలంక లతో ఆడనుంది. అయితే మొట్టమొదటగా శ్రీలంక తో సిరీస్ ఆడనుంది. అది ఈనెల 5 నుండి ప్రారంభం కానున్న టి20 కి టీం ఇండియా సన్నద్ధం అవుతుంది. ఇక అక్టోబర్ లో ఆస్ట్రేలియా గడ్డపై ఐసీసీ టి 20 వరల్డ్ కప్ కి ప్లాన్ చేస్తుండగా.. దానికి ముందు అంటే సెప్టెంబర్ లో ఇంగ్లాండ్ తో సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లాండ్ భారత్ రానుంది.

అయితే టి 20 వరల్డ్ కప్ కి జట్టు ని బలమైన జట్టుగా తీర్చిదిద్దడానికి యాజమాన్యం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. మిగిలిన కొంతమంది ప్లేయర్స్ కూడా పర్వాలేదు. కానీ జట్టు పూర్తి స్థాయి బలంగా ఉంటేనే విజయాలు వరిస్తాయి.

తన ఆట తీరుపై విమర్శలు ఎదుర్కొంటున్నభారత యువ కీపర్ రిషబ్ పంత్ కి పార్థివ్ సలహాలు ఇస్తున్నాడట. “నీ ఆట తీరుపై అనేకరకాల వర్గాల నుండి విమర్శలు ఎదుర్కుంటున్నావ్, కానీ అవేమి నువ్ పట్టించుకోకు.. నీ ఆటను మెరుగుపరచుకో.. ఆటపై దృష్టిపెట్టు, ఆలోచించు.. జట్టు యాజమాన్యం, సెలెక్టర్లు నీకు అండగా ఉన్నారని మర్చిపోకు ” అని పార్థివ్ సలహాలిచ్చాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here