ఫ్రాన్స్‌లో దారుణం….???

14
france

మహ్మద్ ప్రవక్త కార్టూన్ ను విద్యార్థులకు చూపించిన  టీచర్‌ తలను స్కూలు బయటకు తీసుకువెళ్లి నరికాడు  దుండగుడు. ఈ ఘటన పట్ల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఖండించారు .ఈ ఘటన ఉగ్రదాడిగా పరిగణించారు. ఈ అరాచకాన్ని చేసిన గుర్తు తెలియని దుండగుడిని పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం  చేసారు ఇలా చేయగా తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసాడు. పోలీసులు కాల్పులు జరపడం మొదలుపెట్టగా అక్కడికక్కడే ఆ దుండగుడు మృతి చెందాడు.

చనిపోకముందు ఆ దుండగుడు అల్లాహో అక్బర్ అని అరిచాడు జీహాదీ ఉగ్రవాదులే ఇలా వారు  మరణించే ముందు నినాదాలు చేస్తారని ఫ్రాన్స్ పోలీసులు తెలిజేశారు.  ఫ్రాన్స్‌లో 2015 నుంచి అడపా దడపా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయ్. ఈ  ఘటనకు  ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న ఓ  వ్యక్తి చేసిన హత్యగా కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నాం అని ఫ్రాన్స్ పోలీసులు తెలిజేశారు . ప్యారిస్ నగరం లోని  వెలుపల ఉన్న స్కూలులో ఈ అరాచకం జరిగింది. ఈ  సమాచారం తెలుసుకున్న అధ్యక్షుడు వెంటనే ఘటనా స్థలంకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు . దేశంలో టీచర్లకు రక్షణ కల్పిస్తామని తెలిజేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయడం జరిగింది. వీరంతా దుండగుడికి సంబంధించిన వారే అని పోలీసులు తెలిజేశారు.

మృతి చెందిన వ్యక్తి హిస్టరీ టీచర్ అని పోలీసులు ఎలిజేశారు. భావాన్ని వ్యక్తం చేసే టాపిక్‌ పై క్లాస్‌లో చర్చ జరుగుతున్న సమయంలో పిల్లలకు మహ్మద్ ప్రవక్త కార్టూన్ చూపించినట్లు తెలుస్తోంది. అయితే  ముస్లిం సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులను క్లాసు నుంచి బయటకు పంపారు అని ఇతర విద్యార్థులు చెబుతున్నారు. ముస్లిం విద్యార్థులను క్లాసు బయటకు పంపి వివాదానికి గురి అయ్యారు అని  విద్యార్థి తల్లిదండ్రులు తెలిజేశారు.

మొహ్మద్ ప్రవక్త కార్టూన్‌ చూపించే ముందు ముస్లిం విద్యార్థులందరినీ బయటకు వెళ్లాల్సిందిగా టీచర్ చెప్పారని, ముస్లిం విద్యార్థులను బాధపెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పి వారిని  బయటకు పంపారని  ఓ పేరెంట్  కొడుకు చెప్పినట్లు వివరించారు. ఈ ఘటనతో ప్యారిస్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పోలీసులు తమ  అధీనంలో తీసుకున్నారు   పేలుడు పదార్థాలు అక్కడ ఏమైనా  పెట్టారా అన్న కోణంలో  చెక్ చేయించారు. ఈ హత్య ఫ్రాన్స్ పార్లమెంటును సైతం  కుదిపేసింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here