

నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా ఓ రేంజ్ లో అడుగుపెట్టిన తారకరత్న ఉహించనివిధంగా బొక్క బోర్లా పడ్డాడు. చేసిన ప్రతి సినిమా ప్లాప్ టాక్ మూటగట్టుకోవడంతో ఆయన కెరీర్ ఇక ముగిసిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక రోల్స్ చేస్తూ ఎలాగో తన కెరీర్ ను నెట్టుకుంటూ వచ్చిన తారకరత్న ప్రస్తుతం ‘దేవినేని’ అనే మూవీలో నటిస్తున్నాడు. దేవినేని మరియు వంగవీటి కుటుంబాల మద్య ఉన్న సంబంధాల కథతో తెరకెక్కుతున్న ‘దేవినేని’ మూవీ లో తారకరత్న లుక్ తాజాగా మోస్టర్ పోస్టర్ తో విడుదల చేశారు.
ఈ సినిమా నుండి తారకరత్న ఆయన పేరును తారక్ అని మార్చుకుంటున్నట్లుగా ప్రకటించాడు. హీరోలు హీరోయిన్స్ లక్ కలిసి రాడానికి పేర్లు మార్చుకోవడం సహజంగా జరిగేదే. మరి నందమూరి తారకరత్న ఇకపై నందమూరి తారక్ గా పేరు మార్చుకోవడం వలన ఎంత వరకు లక్ కలిసి రానుందో చూడాలి. ప్రస్తుతం సినిమా చివరిదశకు వచ్చిందని త్వరలోనే దేవినేని మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో వంగవీటి రంగ పాత్రలో సంతోషం సురేష్ కొండేటి నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు నర్రా శివనాగు దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా తారకరత్న ఈ సినిమా హిట్ కొడుతుందని చాల నమ్మకంగా ఉన్నాడు.