

స్టార్ హీరో సూర్య తనకి కరోనా సోకినట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. తన అభిమాన హీరోకు కరోనా సోకిందని తెలిసి అభిమానులు కంగారు పడ్డారు.రీసెంట్గా సూర్య సోదరుడు కార్తి తన అన్న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడని చెప్పేసరికి ఫ్యాన్స్ కూల్ అయ్యారు.
ఇప్పుడు కోలీవుడ్ నిర్మాత రాజశేఖర్ పాండియన్ సూర్యకు కరోనా నెగెటివ్ వచ్చిందని, ఆయన పూర్తిగా కోలుకున్నారని చెప్పేసరికి అభిమానులలో ఆందోళనలు తొలగిపోయాయి.ఈ ఏడాది సూరరై పోట్రు సినిమాతో మంచి హిట్ కొట్టిన సూర్య ప్రస్తుతం తన 40వ సినిమాతో బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంక అరుల్ మోహన్ నటించనుంది. ప్రముఖ నటుడు సత్యరాజ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయనున్నారు.