ఓటీటీ ప్లేట్ ఫార్మ్ తో డీల్ సెట్ చేసుకున్న హీరో సూర్య ..!!

25
Surya New Movie

తమిళ హీరో సూర్య తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే.  సూర్య నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన బందోబస్తు సినిమా సైతం భారీ నష్టాలనే మిగిల్చింది. వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్న సూర్య క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు. ఇప్పుడు సూర్య మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

తమిళంలో ‘సూరారై పొట్రు’ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుంది. సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మిస్తున్న  సినిమాను అమెజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబర్ 30 న విడుదల చేయనున్నట్లు తానే స్వయంగా ప్రకటించాడు.

సౌత్ లోనే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మొట్ట మొదటి స్టార్ హీరో మూవీ ‘ఆకాశం నీ హద్దురా’ అని చెప్పవచ్చు. సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ ఆయన సతీమణి జ్యోతిక ‘పొన్మగల్ వంధల్’ చిత్రాలతో పాటు మరో రెండు సినిమాలకు అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదుర్చుకున్నాట. సూర్య ఈ నాలుగు సినిమాల కోసం ప్యాకేజీ రూపంలో  280 కోట్లకి డీల్ సెట్ చేసుకున్నాడని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here