

సన్నబడాలి. నాజూగ్గా కనిపించాలి నేటి యువతలో చాలామంది ఆలోచిస్తున్న ఆలోచనలు ఇవే. పాతికేళ్లకే ఎంతో మంది పొట్టలు పెంచుకుని తిరుగుతున్నారు. రకరకాల అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బందులు పడుతన్నారు. బరువు తగ్గడానికి అష్టకష్టాలు ఎదుర్కుంటున్నారు. ఐతే బరువు తగ్గాలంటే దృఢ నిర్ణయం ఉంటే చాలదు. అందుకు తగ్గ పోషకాహారం తీసుకుని, బరువు తగ్గించేందుకు తోడ్పడే కొన్ని వెరైటీ పళ్లు కూరగాయలను తీసుకోవాల్సిందే. మరి ఇలా వేగంగా మన ఒంట్లో కొవ్వు కరిగించే గుణాలు పుష్కలంగా కలిగిన ఆహారపదార్దాలలో మిర్చి ఒకటని మీకు తెలుసా. మీరు కారం ఇష్టపడకపోయినా కాస్త కారం ఎక్కువ వేసుకుని వండుకుని తింటే మీ బరువును తగ్గించుకోవచ్చు.
మిరపకాయలు ఒంట్లోని కొవ్వు నిల్వలను తగ్గించటంలో చక్కగా సాయపడతాయి కాబట్టి మీ ఆహారంలో మిరపకాయలను ఎక్కువగా ఉండేలా చూసుకోండి. మీకు ఇష్టమున్నా,లేకపోయినా మీరు తినే తిండి కాస్త కారంగా ఉండేలా చూసుకోండి. మిరపకాయల్లోని యాంటీఆక్సిడెంట్లైన కాప్సైసిన్ కు బరువును తగ్గించే లక్షణం ఉంది. దీంతో కడుపు నిండినట్లుగా అనిపించి అతిగా బరువు పెరగకుండా ఉంటారు. కాబట్టి కాస్త స్పైసీ టేస్ట్ ని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టండి. అదే విధంగా బరువును తగ్గిచ్చే వాటిలో కాఫీ కూడా ఒకటి. కాఫీలో ఉండే కెఫీన్ మెటబాలిజం రేటును బాగా పెంచుతుంది. కెఫిన్ వలన ఎక్కువ కెలరీలు ఖర్చవుతాయి. అంటే ఎక్కువ ఫ్యాట్ కరిగిపోతుంది.
నిజానికి బ్లాక్ కాఫీతో మెటబాలిజం పెరుగుతుంది. కాబట్టి మీరు తాగాల్సింది బ్లాక్ కాఫీ మాత్రమే. ప్రొటీన్లకు కేరాఫ్ కోడిగుడ్లు. బ్రేక్ ఫాస్ట్ లో 3 గుట్లు గనుక తింటే అవి 16శాతం బాడీ ఫ్యాట్ ను కరిగిస్తాయి. నూనె వేసి చేసిన ఆమ్లెట్లు కంటే ఉడికించిన గుడ్లు అత్యంత ఆరోగ్యాన్నిస్తాయి. జీరో కెలరీలున్న గ్రీన్ టీ (green tea)తో EGCG అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా మన శరీరానికి అందుతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని చెడ్డ కొవ్వును కరిగించేందుకు బాగా సాయపడతాయి. తరచూ ఓ కప్పు గ్రీన్ టీ తీసుకుంటే కడుపు నిండి, క్రేవింగ్స్ తగ్గి జంక్ ఫుడ్ (junk food) జోలికి పోకుండా ఉంటారు. అలాగే మీ శరీరంలోని కొవ్వును కరిగించడానికి ఆలివ్ ఆయిల్ బాగా తోడ్పడుతుంది. ఇతర నూనెలకంటే ఆలివ్ ఆయిల్ వాడడం వలన చాలా ప్రయోజనాలున్నాయని ఎప్పటినుంచో పరిశోధనలు చెబుతున్నాయి కూడా.