మరింత పటిష్టమైన టీమ్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన సన్ రైజర్స్ టీమ్..

31
sunrisers-hyderabad-searching-for-strong-team-in-ipl2021

ఐపీఎల్ లో అత్యంత నిలకడగా రాణించిన జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ క్రమంలోనే 2021 సీజన్లో సత్తా చాటాలని కసరత్తులు మొదలుపెట్టింది. సన్రైజర్స్ హైదరాబాద్ లో బ్యాటింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2021 ఐపీఎల్ సీజన్ లో తమ బ్యాటింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం సిద్ధమైంది. ఇటీవల ఐపీఎల్ వేలానికి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న సంజయ్ యాదవ్, సందీప్, బిల్లీ స్టాన్లేక్ పృథ్వీరాజ్ ఎర్ర లాంటి ఆటగాళ్లను వేలం కోసం విడుదల చేసింది.

అయితే ఫిబ్రవరి 18వ తేదీన 2021 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి మినీ వేల నిర్వహించనున్న నేపథ్యంలో సన్రైజర్స్ తన బలహీనతలను అధిగమించడం కోసం కీలక ఆటగాళ్లపై కన్నేసినట్లు తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఆడిన కేదార్ జాదవ్ లో పేలవ ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు కానీ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో మాత్రం అద్భుతంగా రాణించాడు. సన్రైజర్స్ ఈ ఆటగాడిని కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యువ ఆటగాడు అది బరోట్, హార్డ్ హిట్టింగ్ ఆల్ రౌండర్ శివమ్ దుబే, ముస్తాఫిజుర్ రహ్మాన్, క్రిస్ మోరిస్, మాక్స్ వెల్ లాంటి ఆల్రౌండర్ లను సొంతం చేసుకునేందుకు హైదరాబాదు జట్టు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here