మరో రొమాంటిక్ సినిమా…

387
Sudigali Sudheer About Next Movie Acting with Reshmi

తెలుగు కామెడీ షో జబర్దస్త్ ద్వారా దాదాపు చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు. స్కిట్స్ కోసం వర్క్ చేసిన రైటర్స్ కి కూడా ఎక్కడో ఒక చోట మంచి గుర్తింపు దక్కుతోంది. అయితే ఎక్కువగా క్రేజ్ అందుకున్న కొందరు మాత్రం సినిమాల్లో క్లిక్కవ్వలేకపోతున్నారు. సుడిగాలి సుధీర్ ఇప్పటికే కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. అయితే అతని సినిమాకు ఐదు కోట్లు లాభం వచ్చినట్లు దర్శకుడు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

ఆల్ టైమ్ టాప్ రేటింగ్స్ అందుకునే జబర్దస్త్ షోలో ఎక్కువగా సుడిగాలి సుధీర్ హవా నడుస్తోంది. గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ కాంబినేషన్ లో సుధీర్ టీమ్ ని లీడ్ చేస్తూ మంచి గుర్తింపు అందుకున్నాడు. దాదాపు ప్రతి స్కిట్ క్లిక్కవ్వడంతో రోజుకి లక్షకు పైగా పేమెంట్స్ అందుకుంటున్నారట. సినిమాల్లో అవకాశాలు వస్తున్నా కూడా జబర్దస్త్ ని వధలడానికి ఇష్టపడటం లేదు.హీరోగా చాలా ఆఫర్స్ వచ్చినప్పటికి కథలు నచ్చకపోవడంతో చేయలేదట. ఇక సాఫ్ట్ వేర్ సుధీర్ అనే కాన్సెప్ట్ నచ్చడంతో ఆ సినిమాను చాలా వేగంగా పూర్తి చేశాడు. కొత్త దర్శకుడు శేఖర్ రాజా రూపొందించిన ఆ సినిమాలో ధాన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటించింది.

గత ఏడాది డిసెంబర్ లో సినిమాను విడుదల చేయగా ఊహించని రిజల్ట్ ని అందుకుంది. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా 5కోట్ల రూపాయల వరకు షేర్స్ అందించింది అని ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని ఎవరు ఉహీంచలేదని చిత్ర దర్శకుడు ప్రచారం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.అసలైతే ఆ సినిమాకు ప్రాఫిట్స్ వచ్చినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అప్పట్లోనే కామెంట్స్ వచ్చాయి. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేవు. జబర్దస్త్ కమెడియన్ బిగ్ స్క్రీన్ పై అంతగా క్లిక్కవ్వలేకపోయాడు అనేది వాస్తవం. మంచి టాలెంట్ ఉన్న గెటప్ శ్రీను కూడా బిగ్ స్క్రీన్ పై ఇంకా నిలదొక్కుకోలేకపోతున్నాడు.

యాంకర్ రష్మీ,సుడిగాలి సుధీర్ ల మధ్య రూమర్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే వారిద్దరిని హీరో హీరోయిన్ గా పెట్టి సినిమా చేయనున్నట్లు అప్పట్లో దర్శకుడు శేఖర్ రాజా ఎనౌన్స్ చేశారు. రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కబోయే ఆ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందట. ఇక అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక బుల్లితెరపై క్లిక్కయిన రష్మీ, సుధీర్ జోడి బిగ్ స్క్రీన్ పై ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here