వార్నర్ ను అలా హడలెత్తించా..!

0
131
Stuart Broad reveals how he trapped David Warner

ఆసీస్ ఓపెనర్ బ్యాట్స్ మాన్ డేవిడ్ వార్నర్ ఎంతటి విధ్వంసకర క్రికెటరో మనకు తెలుసు. ఈయన ఒక సారి క్రీజ్ లో కుదురుకుంటే పించ్ హిట్టింగ్ బౌలర్లను హడలెత్తిస్తాడు. మరి అతన్ని తొందరగా పెవిలియన్ కు పంపడానికి ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆరితేరినట్లు కనిపిస్తుంది. గతేడాది యాషెస్ సిరీస్ లో వార్నర్ కు ఏ వ్యహంతో సిద్దమై సక్సెస్ అయ్యాడో బ్రాడ్ మాటల్లో చూదాం. 2019 యాషెస్ సిరీస్ లో వార్నర్ 10 ఇన్నింగ్స్ లకు గాను 7 సార్లు బ్రాడ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అసలు వార్నర్ ను ఔట్ చేయడానికి ఎటువంటి ప్రణాలికలు సిద్ధం చేసి అతనికి చుక్కలు చుపించాడో ఇప్పుడు తెలుసుకుందాం.

వార్నర్ చాలా ప్రమాదకర ఆటగాడు. నేను దాదాపు చాల కలం  నుంచి వార్నర్ కు బౌలింగ్ చేస్తూనే ఉన్నా. వార్నర్ తో సుదీర్ఘమైన పోటీ ఉండటంతో అతని బలహీనత ఏమిటో తెలుసుకున్నా. నేను చాలా టాలర్‌ బౌలర్. అందుచేత ఆటను క్రీజ్ లో చాలా వెనక్కి ఉంటాడు. అలా ఉండటం వల్ల స్వ్కేర్‌ డ్రైవ్‌లో కొట్టడం ఈజీ అయ్యేది. నేను బంతిని స్వింగ్ చేసిన ప్రతి సారి ఆటను బౌండరీలు కొట్టేవాడు. దాంతో వ్యూహం మార్చా. ఎట్టి పరిస్థితులలో అతనికి స్వింగ్ వేయకుండా వికెట్ తో వికెట్ బంతులే వేయాలనే వ్యూహం రచించా అది వర్కవుట్ అయింది. అలా వేసిన ప్రతి సారి అతను వికెట్ ను సమర్పించుకునే వాడు. దాంతో వార్నర్ పై అదే వ్యూహం అవలంబిస్తూ అతన్ని హడలెత్తించా అని బ్రాడ్ పేర్కొన్నాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here