ఇప్పటికి అయన లుక్స్‌లో పెద్ద మార్పయితే ఏమీ కనిపించదు

0
56
nassar

మామూలుగా సినీ తారల లుక్స్ విషయానికి వస్తే అందరి ఫోకస్ హీరోలు, హీరోయిన్ల మీదకే పోతుంది. వయసు పెరుగుతన్నా ఆ ప్రభావం కనపడకుండా లుక్స్ ఫిజిక్, లుక్స్ మెయింటైన్ చేసే వాళ్లు అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. వాళ్ల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్ల విషయంలో ఈ రకమైన పట్టింపు మాత్రం అసలు ఉండనే ఉండదు. అయితే తమిళ లెజెండరీ నటుడు అయిన నాజర్ విషయానికొస్తే.. ఆయన నాలుగు దశాబ్దాలుగా నటనలో ఉన్నారు. తెలుగు వాళ్లకు కూడా మూడు దశాబ్దాల నుంచి ఆయన సుపరిచితుడు. 90ల్లోనే ‘మాతృదేవోభవ’ సినిమాతో చెరగని ముద్ర విసుకున్నారాయణ. అయితే అప్పటికి ఇప్పటికి అయన లుక్స్‌లో పెద్ద మార్పయితే ఏమీ కనిపించదు. పరిచయం కావడమే మిడిలేజ్డ్ క్యారెక్టర్లలో కనిపించిన ఆయన ఇప్పుడు కూడా అలాంటి విభిన్నమయిన పాత్రలనే వేస్తున్నారు. కొన్నిసార్లు మాత్రం వృద్ధుడి పాత్రల్లో కనిపిస్తూ ఉంటారు కానీ ఆయనకు మరీ వయసు పైబడ్డట్లు అయితే కనిపించడం కష్టమే. తాజాగా నాజర్ ఒక ఆశ్చర్యకరమైన పనితో వార్తల్లోకి ప్రవేశించారు. హీరోలు, హీరోయిన్ల లాగే ఆయనొక స్టైలిష్ ఫొటో షూట్ జరిపారు. చక్కగా తన హెయిర్ ను స్టయిలిషింగ్ చేయించి ఒక కొత్త లుక్ లోకి షిప్ట్ అయిన ఆయన.. టీనేజీ యువకుడిలా ట్రేండింగ్ డ్రెస్ తో   ఫొటో షూట్ లో పాల్గొన్నారు. ఈ ఫొటోల్లో నాజర్‌ను చూసిన వాళ్లకు ఒక విభిన్నమైన అనుభూతి కలగటమే కాక అదే లుక్‌లో ఒక క్యారెక్టర్ చేయమని కూడా చేయమని ఆయన్ను అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దశాబ్దాలుగా లుక్స్ పరంగా పెద్దగా మార్పులేమీ లేకుండా మెయింటైన్ చేయడం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్‌కు అంత సులభతరమయిన విషయమయితే కాదు. ఒకప్పుడు సీరియస్ పాత్రలకే పరిమితం అయిన ఆయన.. దూకుడు, బాద్షా లాంటి సినిమాల్లో ప్రేక్షకులను ఎంతగా నవ్వించారో చూసాం. ఇప్పటికీ బహు భాషల్లో విలక్షణ పాత్రల్లో అద్భుతంగా నటిస్తూ ఎంతో ఉత్సాహంగా సాగిపోతున్నారాయన. అయితే ఆయనకు అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదన్న వార్త మాత్రం వాస్తవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here