బిగ్ బాస్ సీజన్ పై స్టార్ మా సంచలన నిర్ణయం … మొదటి సీజన్ కంటే తక్కువ ప్లాన్ చేశారుగా …!

0
86

ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాదిలో సూపర్ సక్సెస్ అయిన వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. ఎన్నో అనుమానాలు .. మరెన్నో వివాదాల నడుమ తెలుగు లో ప్రసారమైన ఈ షో కు మొదటి సీజన్ నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయములో దీనిపై ఎన్నో విమర్శలు చెలరేగాయి ఎన్ని అడ్డంకులు వచ్చిన మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ..నాలుగో దానికి సిద్ధం అవుతుంది. ఇలాంటి తరుణంలో సీజన్ 4 పై స్టార్ మా యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు రీసెంట్ గా ఓ వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం …! దాదాపు భారతదేశములోచాల రాష్ట్రాల్లో బిగ్ బాస్ ప్రసారం అవుతుంది. హిందీలో అయితే చాల ఏళ్లుగా ఇది వస్తుంది దింతో ఈ షో పట్ల చాల మందిలో ఈ వ్యతిరేకత ఏర్పడింది. హౌస్ లో కంటెస్టెంట్స్ ప్రవర్తించే తీరు .. దాని చుట్టూ అల్లుకునే వివాదాల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. తెలుగులో కాస్టింగ్ కోచ్ కూడా వెలుగు చూసింది మిగిలిన భాషలో మాదిరిగానే తెలుగులోను బిగ్ బాస్ సూపర్ హిట్ అయింది. అందుకే షో నిర్వాహకులు ప్రతి ఏడాది దీని ప్రసారం చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రేక్షకుల ఓట్లు ఆధారంగా విజేతను నిర్ణయించే ఈ షో లో ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లో .. మొదటి దానిని శివబాలాజీ, రెండో దాన్ని కౌశల్ మందా, మూడోది రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ .. నాలుగో దానిని కూడా ప్రారభించబోతుందని కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే షో నిర్వహకులు కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసే ప్రక్రియను కూడా ప్రారంభించారని వార్తలు వస్తున్నాయ్. ఆగష్టు నుంచి ఈ సీజన్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు . దింతో ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోతున్నాయి. కొద్ది రోజుల్లో నాలుగో సీజన్ ప్రారంభం కాబోతుందన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలోనే… దానిని ఎవరు హోస్ట్ చేస్తారన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై కొందరు జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తుండగా… మరికొందరు మాత్రం నాగార్జననే కంటిన్యూ చేస్తారని అంటున్నారు. మొత్తానికి వీళ్లిద్దరిలో ఒకరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఈ సీజన్‌కు సంబంధించిన ప్రకటన కూడా వెలువడక ముందే.. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో హీరో అల్లరి నరేష్, సింగర్ హేమచంద్ర, కమెడియన్ తాగుబోతు రమేష్, యాంకర్ వర్షిణి, సింగర్ మంగ్లీ, యాంకర్ ఝాన్సీ, హీరో నందు సహా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీళ్లే ఫైనల్ అవుతారా అన్నది తెలియాలి. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సీజన్ 4 గురించి తాజాగా ఓ షొక్కింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సీజన్‌ను కేవలం 50 రోజులకే పరిమితం చేశారట. కరోనా ప్రభావం కారణంగానే తక్కువ మంది కంటెస్టెంట్లతో ఇలా కానిచ్చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఫస్ట్ సీజన్ 70, రెండు, మూడు సీజన్లు 100 రోజులు ప్రసారం అయిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here