పిట్టకథలు సిరీస్‌పై ప్రశంసలు కురిపించిన స్టార్ హీరోయిన్‌లు..!!

27
Pitta Kadalu Web Series

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెలుగు పరిశ్రమపై  దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. పిట్టకథలు వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. పిట్టకథలు నలుగురు మహిళల కథలు ఆధారంగా రూపొందుతున్న అంథాలజీ వెబ్ సిరీస్‌.ఈ వెబ్ సిరీస్‌ని  నలుగురు దర్శకులు తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, నాగ్ అశ్విన్, నందినీ రెడ్డి రూపొందించారు. ఈ వెబ్ సిరీస్‌లో శ్రుతి హాసన్, అమలాపాల్, మంచు లక్ష్మీ, ఈషా రెబ్బ, సాన్వే మేఘన, జగపతి బాబు, సత్యదేవ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ వెబ్ సిరీస్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌ ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రేక్షకుల ఆదరణ పొందింది. తాజాగా ఈ సిరీస్‌పై స్టార్ హీరోయిన్‌లు సమంత, రకుల్ ప్రీత్ సింగ్‌లు స్పందించారు.ఈ వెబ్ సిరీస్ ని  అందరూ చూడాలని, పిట్టకథలు అద్భుతంగా ఉందని అన్నారు. ఇందులో మీరా భాగానికి దర్శకత్వం చేసిననందినీ రెడ్డిపై సమంతా ప్రశంసల వర్షం కురిపించారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ వెబ్ సిరీస్‌లో మంచు లక్ష్మీ నటనకి  ఫిదా అయిపోయింది అంట .ఇందులోని నటీనటులు అందరూ తమతమ పాత్రలకి  ప్రాణం పోశారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here