ఉప్పెన రీమేక్ లో స్టార్ హీరో తనయుడు

0
162

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు అయినా  వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ఉప్పెన‘. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కావలసి ఉండగా కరోనా కారణంగా సినిమా విడుదల తేది వాయిదా పడింది. కాగా ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే దీనిలోని సాంగ్స్ హిట్ టాక్ ని తెచ్చుకోవడం తో ఈ సినిమాకు చాలా క్రేజ్ వచ్చింది. కృతీ శెట్టి ఈ సినిమాకు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఇందులో విలన్ తమిళ నటుడు విజయ్ సేతుపతి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ తాజా న్యూస్ ఫిల్మీదునియాలో చక్కర్లు  కొడుతోంది. ఈ న్యూస్ ప్రకారం విజయ్ సేతుపతి ఈ సినిమాకి సంబంధించి తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడని వార్త. ఇప్పటికే ఒక మంచి లవ్ స్టోరీ దొరికితే అందులో తన కొడుకుని హీరోగా పరిచయం చెయ్యాలని ఎదురు చూస్తున్నాడు తమిళ్ హీరో విజయ్. విజయ్ సేతుపతి ఈ కథను విజయ్ కి వినిపించినట్లు సమాచారం. ఈ స్టోరీ విజయ్ కి కూడా నచ్చిందని విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ విదేశాల నుండి తిరిగి వచ్చిన వెంటనే అతనితో కూడా చర్చించి ఈ సినిమాను ఓకే చేయనున్నట్లు సమాచారం. విజయ్ కుమారుడు ప్రస్తుతం కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తున్నాడు. అది కంప్లీట్ అవ్వగానే ఈ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా పరిస్థితులు సద్దుమణిగితే ఈ ఏడాది చివరికి ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. తెలుగులో ఉప్పెనకు దర్శకత్వం వహిస్తున్న బుచ్చిబాబు తమిళంలో కూడా దర్శకత్వ  బాధ్యతలు చేపట్టనున్నట్లుగా తెలుస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు కరోనా తరువాత తెలియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here