నేటితో ముగియనున్న శ్రీశాంత్ నిషేధం.. ఇక ఫుల్ ఫ్రీ

0
50
sreesanth ban ends now

స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న టీమిండియా సీనియర్ పేసర్ శ్రీశాంత్ ఏడేళ్ల నిషేధానికి  ఇక స్వస్తి పలికినట్టే. అతడిపై విధించిన నిషేధం నేటితో ముగించుకున్న 37 ఏళ్ల శ్రీశాంత్ ఇప్పటికే తన మనసులోని మాటను వ్యక్తపరిచారు. కనీసం దేశవాళీ క్రికెట్‌లోనైనా అడుగుపెడతానని గతంలోనే చెప్పుకొచ్చాడు. అతడు పూర్తి ఫిట్‌గా కనపడితే పరిగణనలోకి తీసుకొనే ఆలోచన మాకు ఉందని స్వరాష్ట్రం కేరళ కూడా భరోసా ఇచ్చింది. ‘‘నాకిప్పుడు పూర్తిగా స్వతంత్రం వచ్చింది నేను ఎక్కువగా ప్రేమించే ఆటకు తిరిగి ప్రాతినిధ్యం చేస్తాను. ప్రతి బంతినీ ఉత్తమంగా సాధించడానికి ప్రయత్నిస్తాను. అది ప్రాక్టీస్ అయినా సరే బౌలింగ్ చేస్తాను” అని తన నిషేధం ఆగ్నేలు ముగియనున్న రెండు రోజుల క్రితం తన ట్వీట్ ద్వారా తెలిపాడు. మరో ఐదు నుంచి ఏడేళ్లు వరకు ఆటలో ఉంటానని, తాను ఏ జట్టు తరపున బరిలోకి దిగినా అత్యుత్తమమయిన ప్రదర్శనను కనపరుస్తానని పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా దేశీవాళీ సీజన్లు అన్ని వాయిదాలో ఉన్నాయి. కేరళ శ్రీశాంత్ కి అవకాశం ఇచ్చే ఆలోచన ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా మ్యాచ్‌లు జరిగే పరిస్థితి లేదు. నిజానికి భారత్‌లో డొమెస్టిక్ సీజన్ ఆగస్టులోనే ప్రారంభమవ్వాల్సి ఉంది కానీ పరిస్థితులు అనుకూలించక, అనుకూలించిన వెంటనే దేశవాళీ క్రికెట్‌కు అనుమతులు ఇస్తామని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఈ మధ్యనే ప్రకటించాడు. 2013 ఐపీఎల్ ఎడిషన్‌లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా జీవితకాల నిషేధానికి గురయ్యాడు. బిసిసిఐ అంబుడ్స్‌మన్ అయిన డీకే జైన్ గత సంవత్సరం శ్రీశాంత్ పై ఉన్న నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించారు. ఆగస్టు 2013లో శ్రీశాంత్‌తోపాటు రాజస్థాన్ రాయల్స్ సహచరులు అజిత్ చండీలా, అంకీత్ చవాన్‌లను బీసీసీఐ నిషేదంక్షలను విధించింది. తన నిషేధంపై శ్రీశాంత్ ఎన్నో ఏళ్ళు న్యాయ పోరాటం చేశాడు. చివరికి గతేడాది మార్చి 15న.. బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులను పక్కన ఉంచి శ్రీశాంత్‌కు విధించిన నిషేదాఅంక్షల కాలాన్ని తగ్గించాలని బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో అతడిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదించింది. శ్రీశాంత్ తన కెరియర్‌లో 27 టెస్టులు, 53 వన్డేలు అడగా, వరుసగా 87, 75 వికెట్లు పడగొట్టడం విశేషం. 10 టీ20లలో ఏడు వికెట్లు కూడా తీయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here