ఎస్ బ్యాంకు దివాళాకు కారణం ఏంటి? అసలేం జరిగింది ??

0
239
YES Bank crisis: Raising capital immediate priority, says Prashant Kumar

“అనుభవమే మా నైపుణ్యం అన్నది” ఎస్ బ్యాంకు నినాదం. ఇప్పుడు అయితే ఆ అనుభవమే ఇప్పుడు ఎంత వేగంగా మార్కెట్లోకి పైకి దూసుకెళ్ళిందో ఇప్పుడు కుప్పకూలేలా చేసింది. బ్యాంకింగ్ సంక్షోభాలు మనదేశానికి ఏమి కొత్తకాదు. ఇలాంటివి ఎన్నో చూశాం ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకులెన్నో కోలుకోలేని దెబ్బతిన్నాయి. కొన్ని బ్యాంకులైతే చరిత్రలో కలిసిపోయాయి. ప్రభుత్వ విధానాలు రుణ భారాలు బ్యాంకులను ముంచుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఖాతాలో చేరింది ఎస్ బ్యాంకు. దేశంలోని ప్రైవేట్ బ్యాంకులైన ICICI, HDFC వంటి బ్యాంకులతో పోటీపడి నిలదొక్కుకున్నప్పటికీ చివరికి డీలా పడింది.

కేవలం మాటలతో సరిపెట్టుకోకుండా చేసిచూపించిన ఎస్ బ్యాంకు 2015 లో ఒక టార్గెట్ ను పెట్టుకుని దానిని ఛేదించింది. అంతేగాక టాప్ బ్యాంక్స్ లలో ఒకటిగా నిలిచింది. తమకి అందివచ్చిన అవకాశాలన్నిటిని అందిపుచ్చుకుంది. మార్కెట్లో నిలదొక్కుకునేందుకు అనేక వ్యూహాలు రచించగా వాటిలో కొన్ని ఫలించాయి. మరికొన్ని వికటించాయి. ఎస్ బ్యాంకు తీవ్ర సంక్షోభంలో చిక్కుకోవడంతో RBI మారటోరియం విధించింది. బోర్డును కూడా రద్దుచేసింది అంతఁగాక బ్యాంకు లావాదేవీలపై అనేక ఆంక్షలు విధించింది. ఎస్ బ్యాంకు ఎటిఎం లను మూసివేసింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది డబ్బులు తీసుకోవాలంటే కచ్చితంగా బ్యాంకు కి వెళ్లాల్సిన పరిస్థితి. విత్ డ్రా అమౌంట్ ను 50,000 మించి చేయకూడదని నిబంధనలు విధించింది.

రుణాలు తీసుకునే అర్హత సదరు సంస్థలకి ఉందా? తీసుకున్న లోన్లను తిరిగి చెల్లించగల సత్తా ఉందా? లేదా? అసలు ఆయా కంపెనీ ల ట్రాక్ రికార్డు ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సంబంధం లేకుండా విచ్చలవిడిగా లోన్లు మంజూరు చేయడం మొదలుపెట్టింది. చివరికి సంక్షోభంలో కూరుకుపోయింది. ఎస్ బ్యాంకు వద్ద చేసిన అప్పును తీర్చలేక కొన్ని బడా కంపెనీలైతే ఎప్పుడో బోర్డు తిప్పేశాయి. అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, జెట్ ఎయిర్వేస్, DHFL, ESR షిప్పింగ్, కాఫీ డే వంటివి అన్నీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎస్ బ్యాంకు వద్దనే రుణాలు తీసుకుని దానినే ముంచేశాయి.

ఈ ప్రభావం బ్యాంకింగ్ కస్టమర్ల పైననే కాదు పార్టనర్ గా కొనసాగుతున్న చాలామందిపై పడింది. swiggy, flipcart, makemytrip, phone pay వంటి వాటిపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. దీనితో ప్రజలు ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్ బ్యాంకు సంక్షోభం నుండి కోలుకునే వరకు ఈ పరిస్థితి తప్పదంటుంది RBI..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here