నాకు సచిన్‌ వార్నింగ్‌ ఇచ్చాడు…

0
109
Sourav Ganguly revealed an incident

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడే రోజుల్లో అతనిలో కోపం చూసిన క్షణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయన ఎటువంటి వివాదాలకు, ఎటువంటి హెచ్చరికలు అనేవి లేకుండానే తన క్రీడా జీవితాన్ని ఆస్వాదించాడు. అయితే సచిన్ టెండూల్కర్ ఆగ్రహానికి తాను గురయ్యానని అంటున్నాడు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉన్న సమయంలో కోప పడటమే కాకుండా అతనికి వార్నింగ్ కూడా ఇచ్చాడని గంగూలీ గుర్తు తెచ్చుకున్నాడు. ఇటీవల సచిన్ టెండూల్కర్ 48 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో అతనితో ఉన్న కొన్ని జ్ఞాపకాలను గంగూలీ అభిమానులతో పంచుకున్నాడు.

1997 సంవత్సరంలో భారత్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఒక టెస్టు మ్యాచ్ ను కోల్పోవడంతో సచిన్ గంగూలీపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఆనాటి మూడో టెస్టులో విండీస్ తమకు 120 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఇవ్వగా. ఇది చాలా స్వల్ప లక్ష్యం కాగా, కాగా మేము 81 పరుగులకే ఆలౌట్ అయ్యాము. దాంతో గెలవాల్సిన మ్యాచ్ ను ఓడిపోయి సిరీస్ ను విండీస్ చేతిలో ఉంచాము. గెలుపు అంచుల వరకూ వెళ్లి ఓడిపోవడంతో డ్రేస్సింగ్ రూమ్ లో సచిన్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆ క్రమంలోనే సచిన్ తన కోపాన్ని గంగూలీ పై చూపించారట. ప్రతి రోజు మైదానం చుటూ పరుగెత్తితేనే భవిష్యత్తు ఉంటుందని, నువ్వు జట్టులో చోటు నిలబెట్టుకోవాలంటే రోజు ఉదయమే పరుగెత్తాలసిందే అని హెచ్చరించాడట. అప్పుడు అది గంగూలీకి కరెక్టే అనిపించిందని అయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here