

సినీ నటుడు సోనూ సూద్ కు ఇప్పుడు ఎంతో మంది తమ గుండెల్లో గుడికట్టుకున్నారు. లాక్ డౌన్ సమయం నుండి ఇప్పటి వరకు ఆయన చేసిన సేవాకార్యక్రమాలు కొన్ని వేల మంది కళ్లలో వెలుగులు నింపుతున్నాయి. ఆయన సినిమాల్లో విలనేమోగాని మా నిజ జీవితాల్లో ఆయనే హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోనూ సూద్ ను చాలా మంది అభిమానిస్తున్నారు. సోనూసూద్ పేరును కొంతమంది వాహనాలపై, కొంతమంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటే ఇంకా కొంతమంది మాత్రం ఆయన పేరును టాటూ వేయించుకుంటున్నారు.
ఈమధ్య ఒక అభిమాని తన చేతిపై సోనూ సూద్ టాటూను వేయించుకున్నాడు. సోనూ సూద్ పేరును టాటూ వేయించుకున్న అతను మా గుండె గుడిలో కొలువై ఉన్నది నువ్వే అంటూ సోనూసూద్ గురించి పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ కు సోనూసూద్ స్పందించి బ్రదర్ మీరు నన్ను అభిమానిస్తున్నారని నాకు తెలుసు. ఇలా మీరు టాటూలు వేయించుకుని బాధకు గురి కావద్దు. అలా చేయడం వల్ల నాకు బాధకలుగుతుంది అంటూ నమస్కారం ఈమోజీని షేర్ చేశాడు.