చలి కాలంలో పెరుగు మేలా..? కీడా..?

26
should-you-have-curd-in-winter

చాలామందికి పెరుగంటే చాలా ఇష్టం.. మరికొంతమందికి దాన్ని చూస్తేనే పడదు..మనకి ఒక నానుడి కూడా ఉంది..”పెద్దలమాట చద్దన్నం మూట” అని. అందుకే వేడి వేడి అన్నంలో తియ్యటి గడ్డపెరుగేసుకుని తింటే ఆ మజానే వేరు. అయితే చలికాలంలో చాలామంది పెరుగును తినడానికి ఇష్టపడరు. కానీ చాలా మంది చలికాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయని భయపడతారు. దాంతో కూరలతో తినేసి భోజనం కానిచ్చేస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పెరుగు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, ఎట్టిపరిస్థితుల్లో పెరుగన్నం తినకుండా భోజనాన్ని పూర్తి చేయకూడదని హెచ్చరిస్తున్నారు.

పెరుగు వల్ల శరీరంలోని రోగనిరోదక శక్తి పెరిగుతుందని, దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మన శరీరం ఎదుర్కోగలదని చెబుతున్నారు. ముఖ్యంగా ఏ ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోడానికి మనం పెరుగు తినడం మానేస్తామో.. వాటిని ఎదుర్కోడానికి పెరుగే సరైన ఔషధామని అంటున్నారు. జలుబు, దగ్గు వంటి సమస్యల మీద పోరాటం చేసే శక్తి పెరుగు వల్ల శరీరానికి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ఉన్న పోషకాలు మలబద్దకం వంటి జీర్ణ సంబంద సమస్యల నుంచి కూడా ఉపశమనం కల్పిస్తుందని వివరిస్తున్నారు. పెరుగువల్ల శరీరంలోని కండరాలకు చాలా మంచి జరుగుతుందట. అంతేకాకుండా ఇందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు పెళుసుబారకుండా దృఢంగా తయారవుతాయి. దంత సమస్యలు కూడా దూరమవుతాయట.

అంతే కాదు పెరుగు రోజూ తినడం వల్ల మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి క్రమంగా తగ్గుతుందట. దీనివల్ల గుండె ఆయుష్షు పెరిగి హార్ట్ అటాక్ వంటి సమస్యలు దరిచేరవని, రక్తపోటు(బీ.పీ)ని సైతం పెరుగు కంట్రోల్ చేస్తుందని హైపర్ టెన్షన్ ను తగ్గిస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే పెరుగును కుదిరినంత వరకు పగటిపూట మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. రాత్రిళ్ళు పెరుగు తింటే మ్యూకస్ పెరుకునే ప్రమాదం ఉందని, అందుకని రాత్రిళ్ళు పెరుగుకు దూరంగా ఉండడమే మంచిదని అంటున్నారు. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు రాత్రిళ్ళు పెరుగు ముట్టుకోవద్దని సూచిస్తున్నారు. రాత్రిళ్ళు పెరుగు తింటే ఆస్తమా రోగుల సమస్య మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. పెరుగు వల్ల ఎన్ని లాభాలున్నాయో చూసారా.. ఇకనైనా ప్రతిరోజూ మీ భోజనంలో పెరుగుండెలా చూసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here